Manjummel Boys : స్టార్ కాస్ట్ లేకుండానే ఆ ఆచీవ్మెంట్

ఎన్నో అంచనాలతో వచ్చే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతాయి. కానీ అతి తక్కువ సినిమాలు మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సంచలనాలను క్రియేట్ చేస్తాయి. రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు అలా వచ్చి మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా ఆడియన్స్ చూడ్డానికి రెడీగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులైతే దీనిలో ఇంకా ముందుంటారని చెప్పొచ్చు.

కంటెంట్ ఉంటే చాలు…
ఇంతకుముందు తమిళ్ లో రిలీజ్ అయిన 96 సినిమా, కన్నడలో రిలీజ్ అయిన కాంతారా, మలయాళంలో రిలీజ్ అయిన హృదయం వంటి సినిమాలకు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. చాలామంది ఈ సినిమాలను థియేటర్లోనే చూశారు. ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాలను చూసి చాలామందికి సజెస్ట్ కూడా చేశారు. 2024వ సంవత్సరంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ సినిమా ముందు బోల్తా కొట్టాయి అని చెప్పొచ్చు. కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఆదరించడం తెలుగు ప్రేక్షకులకు అలవాటు. అందుకే “హనుమాన్” సినిమా సక్సెస్ ఫుల్ గా 150 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

మలయాళ సినిమాలకు కలిసొచ్చిన ఫిబ్రవరి…
ఇక సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. భారీగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా పర్వాలేదు అనిపించింది. ఇకపోతే రవితేజ నటించిన ఈగల్, జీవా నటించిన యాత్ర 2 వంటి సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి తప్ప పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. అయితే మలయాళం సినిమాలు మాత్రం దుమ్ము దులిపాయి అని చెప్పొచ్చు. ఫిబ్రవరిలో మొత్తం మూడు మలయాళం సినిమాలు రిలీజ్ అయ్యాయి. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. వీటిలో రెండు సినిమాలను నేరుగా తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ కూడా చేస్తున్నారు. ప్రేమలు సినిమా మార్చ్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. అలానే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

- Advertisement -

“మంజుమ్మెల్ బాయ్స్” 100 కోట్ల మార్క్…
ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా హిట్టు కొట్టడమే కష్టం అయిపోతున్న ఈ తరుణంలో ఏకంగా 100 కోట్లు మార్కును దాటింది మంజుమ్మెల్ బాయ్స్ సినిమా. అది కూడా చాలామంది బిగ్ స్టార్స్ ఉంటే గాని 100 కోట్లు మార్క్ ను టచ్ చేయలేని ఇలాంటి సమయంలో కేవలం కంటెంట్ వలన ఈ చిత్రం రెండు వారాలోనే 100 కోట్ల మార్క్ అందుకొని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమా కలెక్షన్స్ ను కూడా ఈ సినిమా క్రాస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అద్భుతంగా నడుస్తున్న ఈ సినిమా రన్ ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు