Bollywood heroine: కోట్లు వదిలి సన్యాసిగా మారిన బాలీవుడ్ బ్యూటీ..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు తాము అందంగా ఉన్నప్పుడు.. అందులోనూ వయసులో ఉన్నప్పుడే భారీగా సంపాదించాలని.. కోట్లు కూడబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అంతేకాదు జీవితంలో తమకు నచ్చిన విధంగా బ్రతకాలని కోరుకుంటారు.. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగి.. కోట్లు సంపాదించి .. ఇప్పుడు సన్నాసిగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఆమె ఎవరు ? సన్యాసిగా మారడం వెనుక అసలు కారణం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు సుస్మితాసేన్ , ఐశ్వర్యరాయ్ వంటి అందగత్తెలతో పోటీపడి కొద్దిలో మిస్ ఇండియా టైటిల్ చేజార్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. పలు హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఏమైందో ఏమో కానీ సడన్గా సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చింది..

ఇంతకీ ఎవరీ హీరోయిన్..
ఇక ఈ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా ఆమె పేరు బర్ఖా మదన్.. పంజాబ్ లో పుట్టి పెరిగిన ఈమె మొదట మోడలింగ్ రంగంలోకి వచ్చి.. 1994లో మిస్ ఇండియా ఫైనలిస్ట్ గా నిలిచింది.. అందాల కిరీటం కోసం సుస్మితాసేన్ , ఐశ్వర్యరాయ్ లతో పాటు పోటీపడి మొదటి రన్నరప్ గా నిలిచింది.. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ..మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ లో మూడవ రన్నరప్ గా నిలిచింది.

- Advertisement -

బర్ఖా మదన్ సినీ కెరియర్..
ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. 1996లో హిందీలో ఖిలాడీ కా ఖిలాడీ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ అరంగేట్రం చేసిన బర్ఖా మదన్ ఆ తర్వాత 2012 వరకు మరో ఆరు సినిమాలు మాత్రమే చేసింది.. వీటిలో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన భూత్ కూడా ఉంది.. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరిని అబ్బురపరిచింది. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్ , నానా పటేకర్ , ఫర్దీన్ ఖాన్ , రేఖ వంటి స్టార్లతో కలిసి పని చేసింది. అలాగే నాలుగు సీరియల్స్ లో కూడా నటించింది. 2005 నుండి 2009 వరకు ప్రముఖ జీ టీవీ షో సాఫ్ ఫెరే సలోని కా సఫర్ లో కూడా కనిపించింది..

నిర్మాతగా..
2010లో నిర్మాతగా మారాలనుకున్న ఈమె గోల్డెన్ గేట్ ఎల్ఎల్సి అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది.. సోచ్లో ,సుర్ఖాబ్ వంటి రెండు చిత్రాలను నిర్మించి నటించింది కూడా.. అంతా బాగుంది అనుకున్న సమయంలో 2012లో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది.. అయితే కొన్ని కారణాలవల్ల దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఆ తర్వాత తాను అనుకున్నది నెరవేర్చి అందరిని ఆశ్చర్యపరిచింది. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత గ్యాల్టెన్ సామ్టెన్ గా తన పేరును మార్చుకుంది. ప్రస్తుతం పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తోంది. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ అంటూ కోట్లు సంపాదించిన బర్ఖా మదన్ ఇలా ఉన్నట్టుండి సన్యాసిగా మారడంతో అందరూ షాక్ అయ్యారని చెప్పొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు