Family Star: రిప్లై ఇవ్వడం కూడా సినిమాకు ప్రమోషనే

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి, ఆ తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు రౌడీ హీరో. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపును సాధించి ఇండస్ట్రీలో హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన పర్ఫామెన్స్ తెలుగు సిని ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో శివ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించిన సినిమా అంటే అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమా చాలామందికి ఒక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగాని ఒక టాప్ డైరెక్టర్ ను చేసేసింది. ఇకపోతే విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అర్జున్ రెడ్డి సినిమాకు ఉన్న స్థాయి స్థానం వేరు అని చెప్పొచ్చు. ఆ తర్వాత పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా విజయ్ దేవరకొండ కి మంచి ఫ్యామిలీ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. ఆ సినిమా కూడా దాదాపు 100 కోట్లను వసూలు చేసింది. అంత అద్భుతంగా సినిమా తెరకెక్కించాడు పరశురాం. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా కోసం పనిచేస్తున్నారు.

హైప్ పెంచేసిన “ఫ్యామిలీ స్టార్” టీజర్…

ఫ్యామిలీ స్టార్ సినిమాని మొదట అల్లు అరవింద్ నిర్మించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మితమవుతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇదివరకే వచ్చిన టీజర్ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. రీసెంట్ గా ఈ సినిమా మరో టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా పైన అందరికీ మంచి అంచనాలు పెరుగుతున్నాయి.

- Advertisement -

చెప్పుల గొడవ… ఇదే కొత్త స్ట్రాటజీ

ఇకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎంత బాగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సెలబ్రిటీని మెన్షన్ చేసి ఏదైనా ఒక కౌంటర్ ట్వీట్ వేస్తే దానికి రిప్లై వచ్చినా కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. అటువంటిదే జరిగింది ఒక నెటిజన్ కి. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి టీజర్ అప్డేట్ పోస్టర్ ను ముందుగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అయితే టీజర్ కి ముందు విజయ్ దేవరకొండ లుంగీ కట్టుకొని కాస్ట్లీ చెప్పులతో నిలుచున్న ఒక ఫోటోను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఆ ఫోటో చూసి నెటిజన్ క్రాక్స్ చెప్పులు వేసుకొని మిడిల్ క్లాస్ అంట… సూపర్ అన్న అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు. అయితే దీనికి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈ చెప్పులు వేసుకోకూడదు కదా అంటూ కామెంట్ చేశారు. కానీ దీనికి ఏకంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ 70% ఆఫ్ లో కొన్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా ఇది కూడా సినిమాకి ఒక రకమైన పబ్లిసిటీ అని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు