Nivetha Pethuraj: మా కుటుంబం పరువు తీయకండి

నివేతా పేతురాజ్ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని డబ్బింగ్ సినిమాలు ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేతా, ఆ తర్వాత స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ చేసి తనకంటూ ఒక పేరును సాధించుకుంది. నివేతా కెరియర్ లో వచ్చిన చిత్రాలహరి,పాగల్ , అలవైకుంఠపురంలో బ్రోచేవారెవరురా సినిమాలు మంచి పేరును తీసుకొని వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించింది నివేతా.

నివేతా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈ తరుణంలో తమిళ్ మీడియా నివేతా గురించి తప్పుగా కొన్ని వార్తలను రాసింది. అయితే వాటన్నిటికీ వెంటనే స్పందించకుండా చాలా రోజులు భరించి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ను తమిళ్ మీడియాకు ఇచ్చింది నివేతా పేతురాజ్. తన గురించి వాస్తవాలు తెలియకుండా తప్పుడు న్యూస్ రాయొద్దు అంటూ తమిళ్ మీడియాను అభ్యర్థించింది.

నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలోకి . నేను మౌనంగా ఉన్నాను. కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా మరియు స్థిరంగా ఉన్నాను. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్‌లో నివసిస్తోంది. మేము 20 సంవత్సరాలకు పైగా దుబాయ్‌లో ఉన్నాము.

- Advertisement -

సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నాకు అవకాశాలు దొరికాయి. నేను ఎప్పుడూ పని లేదా డబ్బు కోసం అత్యాశతో ఉండను. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదని నేను చెప్పగలను. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. అలాగే, 2013 నుండి రేసింగ్ అంటే నా అభిరుచి.

నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత నేను మానసికంగా మంచి స్థానంలో ఉన్నాను. నేను గౌరవప్రదమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని, వారు నన్ను ఇలా పరువు తీయడం కొనసాగించరని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కనుక దీనిపై నేను లీగల్ యాక్షన్ తీసుకోవడం లేదు. కుటుంబం ప్రతిష్టను పాడుచేసి, ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని నేను జర్నలిస్టులను అభ్యర్థిస్తున్నాను.

అంటూ ట్విట్టర్ వేదిక తన బాధను వ్యక్తపరిచింది నివేత పేతురాజ్. చాలామంది నివేతా పోస్ట్ కి సపోర్టెడ్ గా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇంతకీ అసలు నివేతా ను టార్గెట్ చేసిన ఆ మీడియా ఛానల్ ఏంటి అని అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీటిపైన మీడియా మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు