Das ka Dhamki: నాలుగు రోజుల్లోనే విశ్వక్ ధమ్కీ ఇచ్చేశాడు..

విశ్వక్ సేన్ తాజాగా అన్ని తానై నిర్మిచిన సినిమా దాస్ క ధమ్కీ. ఉగాది కానుక గా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం కూడా వహించడం జరిగింది. ఫలక్ నామ దాస్ తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వం లో వచ్చిన రెండో సినిమా ఇది.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ లో విశ్వక్ సేన్, కరాటే రాజు నిర్మాతలుగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్, రామ్ మిరియాల కలిసి సంగీతం అందించారు. విశ్వక్ సేన్ హీరోగా ద్విపాత్రాభినయం చేయగా నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. కాగా రావు రమేష్, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, పృథ్వీ, అక్షర గౌడ,
అజయ్ ప్రధాన పాత్రలు పోషించారు.

మంచి అంచనాల మధ్య విడుదలైన రోజు నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ తో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా ఎంటర్టైన్మెంట్ బాగుండడంతో సినిమాని బి సి సెంటర్లలో బాగా చూస్తున్నారు. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి విశ్వక్ సేన్ కి మంచి కంబ్యాక్ హిట్ గా నిలిచింది. హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత సరైన హిట్ లేని విశ్వక్ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అశోక వనంలో అర్జునకల్యాణం మంచి టాక్ వచ్చిన యావరేజ్ గా నిలిచింది.

- Advertisement -

8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన దాస్ కా ధమ్కీ సినిమా 4 రోజుల్లో 8.37 కోట్లు వసూలు చేసి 37 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. మూవీ కలెక్షన్స్ ఎండ్ అయ్యే నాటికీ దాదాపు 15 కోట్లు వసూలు చెయ్యొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మర్చి 30 న విడుదలవుతున్న దసరా సినిమా పోటీని తట్టుకుని నిలబడగలదా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు