5 years for Maharshi: మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సాగదా…

5 years for Maharshi: కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విడుదలైన మహర్షి సినిమా ఒకటి. మహేష్ బాబు పూజ హెగ్డే నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అద్భుతమైన సక్సెస్ ను సాధించింది. మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలబడింది. ఈ సినిమాలో రిషి క్యారెక్టర్ ను వంశీ పైడిపల్లి డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తం రిషి అనే క్యారెక్టర్ యొక్క జర్నీని బేస్ చేసుకుని ఉంటుంది.

ప్రపంచంలో మంచి పేరున్న కంపెనీ యైన ఆరిజిన్ అనే సంస్థకు తెలుగు వాడైన ఋషి కుమార్ సి. ఇ. ఓ గా నియమితుడవ్వడంతో కథ ప్రారంభమవుతుంది. ఋషిది హైదరాబాద్ లో కూకట్ పల్లి లో నివసించే ఒక మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఒక ప్రైవేటు సంస్థలో గుమాస్తాగా పనిచేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. అప్పుల వాళ్ళు ఇంటిమీదకు వచ్చినప్పుడల్లా ఋషికి కోపం వస్తుంటుంది.

ఋషి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విశాఖపట్నంలోని ఓ కాలేజ్ లో చేరతాడు. అక్కడ అతనికి రవి శంకర్, పూజ లతో స్నేహం ఏర్పడుతుంది. ఋషి సహవిద్యార్థి అయిన అజయ్ అనే వ్యక్తికి, తనకన్నా బాగా చదువుతున్నాడని, ఋషి మీద ఈర్ష్య ఏర్పడుతుంది. రాజకీయ నాయకుడైన అజయ్ తండ్రి ఋషికి లంచం ఇచ్చి తన కుమారుడికన్నా అతని ఎక్కువ మార్కులు రాకూడదు అని అడుగుతాడు. కానీ ఋషి అందుకు అంగీకరించకపోగా, అడ్డు వచ్చిన అతని ముఠాని చితకబాదుతాడు.

- Advertisement -

చదువు పూర్తవుతుండగా పెళ్ళి చేసుకుందామన్న పూజ ప్రొపోజల్ కూడా రిజక్ట్ ఋషి. పెళ్ళి తన కెరీర్ కి ఆటంకం అని అతని ఉద్దేశ్యం. పూజకి అతనిమీద మనసు విరిగిపోతుంది. ఇద్దరూ విడిపోతారు. ఆ తరువాత వాళ్ళు ఎలా కలిసారు.? వీకెండ్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ అలానే చాలా అంశాలను ఈ సినిమాలో చూపించాడు వంశీ.

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మంచి సందేశంతో పాటు అన్ని కమర్షియల్ హంగులును ఈ సినిమాలో డిజైన్ చేశాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వడమే కాకుండా, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లయినా కూడా వాటికి అవార్డు రావడం అనేది అరుదుగా జరుగుతుంది. కానీ ఈ సినిమాకి మాత్రం డబ్బులుతో పాటు అవార్డులు కూడా వచ్చాయి.

మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే మహేష్ బాబు తనలోని కంప్లీట్ మాస్ డ్యాన్సర్ ను బయటకు తీసాడు. అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఇప్పటికీ మహేష్ చేసిన ప్రతి సినిమాలో కూడా ఒక మాస్ కమర్షియల్ సాంగ్ ఉంటుంది. కేవలం సందేశం మాత్రమే కాకుండా, పూజా హెగ్డే మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ, అల్లరి నరేష్ మహేష్ బాబు మై ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అన్నిటిని మించి ఈ క్యారెక్టర్ ను వంశీ డిజైన్ చేసిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా రిలీజై నేటికీ ఐదేళ్లు పూర్తిచేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు