PriyankaArulMohan : పక్కాగా హింట్ ఇస్తుందేంటి?

టాలీవుడ్ లో నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. కర్ణాటక కి చెందిన ఈ కన్నడ బ్యూటీ ఒక చిన్న కన్నడ సినిమాలో ముందు నటించినప్పటికీ, అఫిషియల్ గా సినిమాల్లోకి ఎంట్రీ మాత్రం చాలా మంది గ్యాంగ్ లీడర్ అనే అంటారు. అయితే మామూలుగా ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోయిన్ అవ్వాలంటే దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాతో, లేదా మూడు నాలుగు వరుస హిట్లు పడితే తప్ప సాధ్యం కాదు. ఇక ఓవర్ నైట్ స్టార్ అనే పదం కెరీర్ బిగినింగ్ లో పెద్ద పెద్ద హిట్లు కొట్టిన భామలకు ఎక్కువగా వాడుతారు. సాయి పల్లవి, శ్రీ లీల లాంటి హీరోయిన్లు అలా రెండు మూడు సినిమాలకే స్టార్ హీరోయిన్లు అయ్యారు. కానీ ప్రియాంక మాత్రం గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా ఆడినప్పటికీ, ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో హ్యూజ్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది.

గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక బద్దలైపోయే పెర్ఫార్మన్స్ ఏమి చేయలేదు గాని, తన డీసెంట్ క్యూట్ లుక్స్ తో అమాయకంగా అలా యువత మనస్సులో గిలిగింతలు పెట్టి తిష్టేసి కూర్చుంది. అప్పటికి ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ అప్పుడప్పుడు మాత్రమే సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక తెలుగులో మాత్రం శ్రీకారం సినిమాలో నటించి గ్యాప్ ఇచ్చింది. అలా వేరే భాషలలో వరుస సినిమాలు చెయ్యట్లేదు. ఏడాదికి ఒక్కటే లేదా అంతకన్నా ఎక్కువ మాత్రమే చేస్తూ వచ్చింది. అయితే ఈ అమ్మడికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేయడం. సినిమాల్లో పెద్దగా ఎక్స్ పోజింగ్ సీన్లు చేయకుండా డీసెంట్ గా ఉండే రోల్స్ మాత్రమే చేసింది. ఇక బయట సోషల్ మీడియా లో కూడా ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చేస్తూ పోస్టులు పెట్టలేదు. కానీ తాజాగా పెట్టిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన స్టిల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా అప్లోడ్ చేసిన స్టిల్స్ లో కాస్త ఎక్స్పోజ్ చేస్తూ కనిపించి కనిపించినట్లు తన అందాల ఆరబోతతో అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తూ, సినిమాల్లో కూడా పోజులివ్వని ప్రియాంక ఫస్ట్ టైం అలాంటి స్టిల్స్ పెట్టేసరికి నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే ప్రియాంక ఫోజులతో తాను కూడా గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ అని హింట్ ఇస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ప్రియాంక కూడా కమర్షియల్ అయిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మామూలు ఎక్స్పోజింగ్ స్టిల్ తో ఏమి డిసైడ్ చేయలేము. ఇక ప్రియాంక తెలుగులో పవన్ తో ఓజి, నాని సరిపోదా శనివారం సినిమాలతో బిజీ గా ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు