Family Star: మరో వరల్డ్ ఫేమస్ లవర్ అవ్వకుంటే అదే హ్యాపీ

పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి యువత సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. అయితే మొదటి సినిమా తోని మంచి దర్శకుడుగా పేరు సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నాడు. ఇకపోతే రవితేజ హీరోగా తీసిన ఆంజనేయులు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా చేసిన సోలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

సోలో సినిమా సక్సెస్ తర్వాత ఏకంగా మెగా ఫ్యామిలీ లో ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్. అల్లు అర్జున్ తో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుందని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ఓకే కాకపోయినా కూడా గీత ఆర్ట్స్ లో సినిమాలు చేసే అవకాశం పరశురామ్ కి దక్కింది. అల్లు శిరీష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాను తెరకెక్కించాడు పరశురామ్. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా కొంతమేరకు విమర్శలు ప్రశంసలను అందుకుంది.

ఇకపోతే పరశురామ్ కెరియర్ ను మార్చిన సినిమా అంటే గీతగోవిందం అని చెప్పొచ్చు. గీత గోవిందం సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది. అప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి ఫేమ్ ఉండటం. ఆ ఫేమ్ ఈ సినిమాకు వర్కౌట్ అవ్వటం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది.
మళ్లీ ఈ కాంబినేషన్లో అదే బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్టు గీతా ఆర్ట్స్ లో జరగలేదు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా నుంచి ఇదివరకు రిలీజ్ అయిన టీజర్లు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నాయి. ఇకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో దాదాపు నలుగురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృనాల్ ఠాకూర్ నటిస్తుంది. రష్మిక కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

వీరిద్దరితోపాటు దివ్యంశ కౌశిక్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిని మించి మరిస్సా రోజ్ అమెరికన్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే విజయ్ దేవరకొండ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. దీనిని బట్టి ఈ సినిమా మరో వరల్డ్ ఫేమస్ లవర్ కాకూడదు అని చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు.ఏదేమైనా ఫ్యామిలీ స్టార్ సినిమా కాన్సెప్ట్ ఏంటి అని రీసెంట్ జరిగిన ఒక ఈవెంట్లో దిల్ రాజు రీవీల్ చేసారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు