Suspense Thrillers In OTT : ఓటీటీని దున్నేస్తున్న టాప్ 10 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Suspense Thrillers In OTT : కరోనా వచ్చిన తర్వాత చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన ఆధారపడ్డారు.. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది.. అందుకే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. ఇప్పుడు ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడకుండా.. తమకు నచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ల సబ్స్క్రిప్షన్ పొంది కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షిస్తున్నారు. పైగా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవ్వడమే కాదు.. కామెడీ , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్ని రకాల కంటెంట్లతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయి.. ఇక ఈ క్రమంలోనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను దున్నేస్తున్న టాప్ 10 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ( Suspense Thrillers In OTT ) గురించి ఇప్పుడు చూద్దాం..

1).మిడ్ నైట్ మర్డర్స్…

top-10-suspense-thriller-movies-on-ott

 

- Advertisement -

2020లో మలయాళం లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ అంజామ్ పథిరా.. ఈ సినిమా థియేటర్లో విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఆ తర్వాత ఈ చిత్రాన్ని మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో ఓటీటీ లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే డాక్టర్ అన్వర్ హుస్సేన్ ఒక సైకాలజిస్ట్.. అనధికారంగా క్రిమినాలజిస్ట్ గా పనిచేస్తూ పోలీసులకు సలహా ఇస్తూ ఉంటారు.. అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైదీలను కలిసి.. వారితో మాట్లాడి..వాళ్ళు ఎందుకు హత్యలు చేశారు? అందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి ? ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అని రీసెర్చ్ చేస్తూ పోలీసులకు కొన్ని కేసుల్లో సహాయపడుతూ ఉంటారు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ క్రిమినాలజిస్ట్ గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. వరుసగా పోలీస్ ఆఫీసర్స్ హత్యకు గురవడం మొదలవుతుంది.. ఆ పోలీస్ ఆఫీసర్స్ కళ్ళు , గుండెను తొలగించి కాళీ ప్రదేశాల్లో పడేస్తారు. అన్నీ కూడా అర్ధరాత్రి మాత్రమే హత్యలు జరుగుతాయి.. ఎవరు చేస్తున్నారు? ఎందుకు పోలీసులనే టార్గెట్ చేశారు? అనేది ఎవరికి అర్థం కాదు ఇక అదే సమయంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్ తో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి ఆ హత్య లు ఎవరు చేశారు అనేది స్టోరీ లైన్.. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ : ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్..ఫిబ్రవరి 19 2021
IMDb రేటింగ్: 9.1/10

2).K-13…

top-10-suspense-thriller-movies-on-ott

కే 13 మూవీ ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.. ఈ సినిమాను భరత్ నీలకంఠం తెరకెక్కించగా ఇందులో అరుణ్ నిధి , శ్రద్ధ శ్రీనాథ్, అధిక్ రవిచంద్రన్, యోగి బాబు, గాయత్రి తదితరులు కీలక పాత్రలు పోషించారు.. స్టోరీ విషయానికి వస్తే.. మదియా జగన్ అనే ఒక డిప్రెసెడ్ ఫిలిం మేకర్ రోజు బార్ కి వెళ్తూ ఉంటాడు.. అక్కడ ఒక అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతాడు..కట్ చేస్తే K-13 అనే ప్లాట్ ఫామ్ లో ఒక గదిలో తను కట్టేసి ఉంటే ఆ అమ్మాయి మాత్రం చనిపోయి ఉంటుంది.. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నమే కే 13.
ఓటీటీ ప్లాట్ ఫామ్:జియో , సన్ ఎన్ ఎక్స్ట్
ఓటీటీ రిలీజ్ డేట్: 2019 మే 3
IMDb రేటింగ్: 6.0/10

3). కన్నూర్ స్క్వాడ్…

top-10-suspense-thriller-movies-on-ott

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూలు చేసింది.. కన్నూరు జిల్లాలో నేరాలను అరికట్టడానికి వచ్చిన ఏఎస్ఐ జార్జ్ మార్టిన్ బృందానికి ఎదురైన పరిస్థితులు, ఆ తర్వాత ఓ రాజకీయ నాయకుడి హత్య కేసు వీరి వద్దకు రావడం తర్వాత జరిగే పరిణామాలే కన్నూర్ స్క్వాడ్ స్టోరీ లైన్. చూస్తున్నంత సేపు స్క్రీన్ కి కట్టిపడేస్తుంది ఈ సినిమా..
ఓటీటీ ప్లాట్ ఫామ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 నవంబర్ 17
IMDb రేటింగ్: 8.0/10

4). గరుడన్

top-10-suspense-thriller-movies-on-ott

గరుడన్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అరుణ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ.. ఒక విద్యార్థిని వేధించిన కేసును ఒక పోలీస్ ఆఫీసర్ , ఒక ప్రొఫెసర్ ఎలా ఎదుర్కొన్నారు అనేది స్టోరీ లైన్.. చాలా థ్రిల్లింగ్ గా.. సస్పెన్స్ గా కొనసాగుతుంది..
ఓటీటీ ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 డిసెంబర్ 1
IMDb రేటింగ్: 7.3/10

5). దయ..

top-10-suspense-thriller-movies-on-ott

ట్రైలర్ తోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు జెడి చక్రవర్తి. సత్య అనే ఒక ఆర్డినరీ పర్సన్ బ్రతుకుతెరువు కోసం ఫ్రీజర్ వ్యాన్ ని నడుపుతూ ఉంటారు. అలాంటి సత్య లైఫ్ లోకి ఒక అమ్మాయి రావాల్సింది పోయి ఒక డెడ్ బాడీ వస్తుంది. ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది.. ఆ మిస్టరీలో ఒక్కొక్క ఫేస్ రివీల్ చేసేటప్పుడు గూస్ బంప్స్ వచ్చేస్తాయి.. జెడి తో పాటు ఈషా రెబ్బ, కమల్ కామరాజు , విష్ణు ప్రియ పర్ఫామెన్స్ మరో లెవల్ అని చెప్పవచ్చు.
ఓటీటీ ప్లాట్ ఫామ్: హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 ఆగస్ట్ 4
IMDb రేటింగ్: 6.4/10

6). చక్రవ్యూహం ది ట్రాప్…

top-10-suspense-thriller-movies-on-ott

సిరి మరియు సంజయ్ అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకొని ఉంటారు.. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా.. ఒకరోజు సంజయ్ బిజినెస్ పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి.. సిరి ఆ ఇంట్లో చనిపోయి ఉంటుంది.. అది చూసిన సంజయ్ సిరి చావు కి కారణాలు కనుక్కొని.. పోలీస్ బృందంతో చేసే ఇన్వెస్టిగేషన్ చాలా హైలెట్.. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరనేది రివీల్ చేయకుండా.. అసలు ఆడియన్స్ కూడా గెస్ చేయలేనంతగా థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చక్రవ్యూహంలో ఎవరు ఇరుక్కున్నారు.. ఎవరిని ఎవరు ట్రాప్ చేశారు.. అనేది చక్రవ్యూహం ది ట్రాప్..
ఓటీటీ ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 జూలై 6
IMDb రేటింగ్: 6.5/10

7). ఇరట్ట…

top-10-suspense-thriller-movies-on-ott

ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఒక పోలీస్ స్టేషన్లో హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది ఎవరు అని జరిపే ఇన్వెస్టిగేషన్లో ఆ మర్డర్ చుట్టూ ఉన్న మనుషులలో ఒక డార్క్ సైట్ చనిపోయిన వ్యక్తికి ఎలా లింక్ అయింది అని తెలుసుకునే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది.. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూవీ మీకు ఎక్కడ దొరకదు. లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్ గా.. మిమ్మల్ని స్క్రీన్ కి కట్టిపడేస్తుంది.
ఓటీటీ ప్లాట్ ఫామ్: నెట్ ఫ్లిక్స్ తెలుగు
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 మార్చ్ 3
IMDb రేటింగ్: 7.7/10

8). జోజి…

top-10-suspense-thriller-movies-on-ott

విలియం షేక్స్పియర్ రాసిన మ్యాక్ బెత్ నాటకం ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా మూవీనే ఈ జోజి. ఈ సినిమా స్టోరీ విషానికి వస్తే.. ఆస్తి అనుభవించడం కోసం అడ్డుగా ఉన్న తండ్రిని అతడి కుమారుడు ఎలా అంతమొందించాడు… ఆపై జరిగే పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ లైన్..
ఓటీటీ ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2021 ఏప్రిల్ 7
IMDb రేటింగ్: 7.8/10

9). దూత…

top-10-suspense-thriller-movies-on-ott

2023లో రిలీజ్ అయిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ.. సాగర్ అనే ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్.. తన సక్సెస్ ని లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. ఊహించని పరిస్థితులు అతడికి ఎదురవుతాయి. తన జీవితాన్ని చిత్తు కాగితాలు నిర్ణయిస్తాయి. అది ఎలాగో ఏంటో తెలియాలి అంటే ఈ దూత వెబ్ సిరీస్ చూడాల్సిందే. మెయిన్ నాగ చైతన్య యాక్టింగ్ ఈ వెబ్ సిరీస్ కి హైలెట్గా నిలిచింది.
ఓటీటీ ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 డిసెంబర్ 1
IMDb రేటింగ్: 7.8/10

10).కోహ్రా…

top-10-suspense-thriller-movies-on-ott

2023లో విడుదలైన మోస్ట్ పాపులర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి.. అవార్డు విన్నింగ్ పంజాబీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్.. స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఊరి చివర్లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది.. ఆ డెడ్ బాడీ ఎవరిది అని జరిపే ఇన్వెస్టిగేషన్ లో ఆ ఊర్లో జరుగుతున్న మోస్ట్ పాపులర్ పెళ్లికి.. ఆ డెడ్ బాడీ కి లింక్ వుందని పోలీసులు కనిపెడతారు. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు? దానిని పోలీసులు కనిపెట్టారా? లేదా? వారికి వున్న ఆ లింకు ఏంటి.. ? అనేది ఈ స్టోరీ లైన్.. ఇదొక స్లో పాయిజన్ లాంటిది.. మెల్లిగా మొదలయ్యి చివరికి వచ్చేసరికి చాలా థ్రిల్లింగ్ గా ఎంగేజ్ గా అనిపిస్తుంది.. చివరి క్షణం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం కచ్చితంగా నచ్చేస్తుంది.. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రగుల్ చేస్తుంది అనే విషయాలను చాలా నీట్ అండ్ క్లియర్ గా చూపించారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్: నెట్ ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023 జూలై 15
IMDb రేటింగ్: 7.5/10

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు