Dhootha : వెబ్ సిరీస్ ఓటిటి స్ట్రీమింగ్ తో అక్కినేని ఫ్యాన్స్ అప్సెట్

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ “ధూత” ప్రస్తుతం ఓటీటిలో అందుబాటులోకి వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. అయితే అక్కినేని అభిమానులు నిరాశ పడడానికి కారణం వెబ్ సిరీస్ బాగా లేకపోవడం కాదు. ఓటిటిలో స్ట్రీమింగ్ కావడం.

8 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. జర్నలిస్ట్ సాగర్ భవిష్యత్తును ఒక వార్త పేపర్ కటింగ్ ముందే చూపించడంతో వాటి వల్ల జరిగే ఒక్కో సంఘటనతో సాగర్ అగాధంలోకి కురుకుపోతాడు. ఆ పేపర్ కటింగ్స్ ను ఎవరు పంపుతున్నారు? సాగర్ భవిష్యత్తు వారికి ముందే ఎలా తెలుస్తోంది? అసలు ధూత ఎవరు? వారితో సాగర్ కున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికర విషయాలను వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య తో పాటు పార్వతీ తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియ భవాని శంకర్ తదితరులు నటించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్ ను చూసినవారు 4 గంటల పాటు 8 ఎపిసోడ్లతో సాగిన ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా ఉందని చెబుతున్నారు.

విమర్శకులు సైతం ఈ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దెయ్యం లేకుండానే ఏదో ఒక అదృశ్య శక్తి క్రియేట్ చేసే సంఘటనలు, ఉత్కంఠ భరితమైన ట్విస్టులతో, వర్షంలో సాగే సన్నివేశాలతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికల్ పాయింట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ కి ఇంత మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంటే ఫ్యాన్స్ మాత్రం “ధూత”పై కాస్త అసంతృప్తిగా ఉన్నారు.

- Advertisement -

గత ఏడాది నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన “థాంక్స్” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ మరోసారి విక్రమ్ కుమార్ తో కలిసి “ధూత” చేయడానికి ముందుకు వచ్చాడు నాగచైతన్య. ఇదిలా ఉంటే “థాంక్స్” మూవీ కంటే “ధూత” వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఉంది. ఇంతటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో రూపొందిన “ధూత” వెబ్ సిరీస్ సినిమాగా థియేటర్లలోకి రావాల్సిందని అంటున్నారు. థియేటర్లలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాల్సిన “ధూత”ను వెబ్ సిరీస్ గా ఓటిటిలో రిలీజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం నాగచైతన్య ఓటిటి అరంగ్రేటం “ధూత”కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు