Hyper Adhi: ఇండస్ట్రీ లోకి వస్తా అన్నప్పుడు దాసరి గారు ఏమన్నారంటే..?

జబర్దస్త్ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బుల్లితెరపై హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో చేస్తూ నవ్వుల్ని పంచుతున్నారు. ఒకవైపు టీవీ షోల తోనే కాదు సినిమాలలో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిన ఆది.. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి.. నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈటీవీ , మల్లెమాల వల్లే తాను ఇలా మారడానికి కారణమని ఎప్పుడు చెబుతూ ఉంటారు ఆది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది.. తన పేరు ఆదయ్య అని , తాను హైపర్ ఆదిగా ఎలా మారాడు అన్న విషయాన్ని వెల్లడించారు.

ఆది మాట్లాడుతూ.. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని, టెన్త్ 545, ఇంటర్950, బీటెక్ 85% మార్కులు వచ్చాయి. దీంతో ఈ సర్టిఫికెట్స్ తీసుకొని దాసరి నారాయణరావు గారి ఇంటికి వెళ్లి పోయా.. ఆయనకు నమస్కారం చేసి సార్ నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను అని.. నా సర్టిఫికెట్ చూపించాను. ఆయన అవి చూసి ఇంత చదివి ఆర్టిస్ట్ అవడం ఏంటయ్యా.. ఏదైనా జాబ్ చేసుకో అని అన్నారు.. అయితే నాకు తెలియక ఇండస్ట్రీలో సర్టిఫికెట్స్ పట్టుకొని తిరిగే వాడిని.. కానీ ఆ తర్వాతే తెలిసింది.. నేను సక్సెస్ అయిన తర్వాత దాసరి గారిని కలుద్దామని అనుకున్నాను.. కానీ అది కుదరలేదు అంటూ తెలిపారు.

ఇకపోతే హైపర్ ఆది చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు తాను హైపర్ ఆదిగా మారడం గురించి మాట్లాడుతూ.. మాది ప్రకాశం జిల్లా దగ్గర ఒక చిన్న పల్లెటూరు.. నా అసలు పేరు ఆదయ్య.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హైపర్ ఆదిగా మారాను.. అయితే నాకు ఈ పేరు పెట్టింది డైరెక్టర్లే.. నేను నా స్కిట్స్ లో ఫ్రస్టేషన్ మూడు ఉండేది పెళ్ళాంపై అరిచే స్కిట్లు చేయడంతో నా ఫ్రస్టేషన్ చూసి డైరెక్టర్లు నాకు హైపర్ అని పేరు పెట్టారు. అది నాకు బాగా సెట్ అయింది అంటూ తెలిపారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు