టాలీవుడ్ గ్లోబల్ స్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్నటివరకూ గేమ్ ఛేంజర్ పై మాత్రమే ఫోకస్ చేసిన చరణ్, ఇప్పుడు బుచ్చిబాబుతో సినిమా కూడా స్టార్ట్ చేసేసాడు. త్వరలో సుకుమార్ తో కూడా సినిమా అనౌన్స్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడో తెలిసిందే. పెద్దగా యాడ్స్, ఫోటోషూట్స్ చేయకపోయినా, జనాలకు మాత్రం టచ్ లోనే ఉంటాడు. ముఖ్యంగా ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి ఎక్కువగా హాజరయ్యే చరణ్ తాజాగా ఒక పెళ్ళికి పిలవలేదని అలిగాడు. అది స్వయంగా చెర్రీనే ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. అయితే అసలు విషయానికి వస్తే.. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ‘ఆనంద్ మహీంద్రా’ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పారిశ్రామిక దిగ్గజం ఒక్క బిజినెస్ పరంగానే కాకుండా, ఎన్నో విజ్ఞానదాయకమైన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా యువతరానికి తెలియచేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్ గా ఆయన చేసిన ఘనకార్యం వల్ల రామ్ చరణ్ సోషల్ మీడియా లో ట్వీట్ వేసారు.
సుజీత్ పెళ్ళికి ఎందుకు పిలవలేదు?
తాజాగా ట్విట్టర్ లో రామ్ చరణ్ ఆనంద్ మహేంద్ర తో ఇంటరాక్షన్ అయి అందరికి షాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ తనను పెళ్లికి పిలవకపోవడం గురించి ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించాడు ట్యాగ్ చేస్తూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఇలా ప్రశ్నించారు. ఆనంద్ గారు మీరు నన్ను సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు? నేను ఊరికి దగ్గర్లోనే ఉంటున్నాను. జహీరాబాద్‌కి చెందిన నా స్నేహితులను కలవడం సరదాగా ఉండేది అని అంటూ, ఓ వీడియో ని కూడా పోస్ట్ చేసాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఇక చరణ్ పోస్ట్ చేసిన వీడియోకి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ఇలా బదులిచ్చారు. నేను అంగీకరిస్తున్నాను. నేను గందరగోళానికి గురయ్యాను. మీకు ఆహ్వానం పంపడం మిస్సయ్యాను. నేను మీ చివరి లెసన్ ఆధారంగా నా డ్యాన్స్ మూవ్స్ లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నంలో ఉన్నాను. ఇకపై అయినా గందరగోళానికి గురికాకుండా, మళ్లీ మిస్ అవ్వకుండా ఉండనివ్వండి, అంటూ మీకు అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని అన్నారు.
అసలు సంగతి ఇది!
అయితే ఆనంద్ మహేంద్ర జహీరాబాద్ లో చేసిన మంచిపనుల్లో అపరిష్కృతంగా ఊళ్ళో ఉన్న ఒకప్పటి తాగు నీటి సమస్యను హైలైట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇక్కడ నీటి కొరత కారణంగా పురుషులు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. సుజీత్ (ప్రకటనలో నటించినవాడు) లాంటి కుర్రాళ్లకు వధువుని ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఈ సమస్య జహీరాబాద్‌కు మాత్రమే కాదు, చాలా భారతీయ గ్రామాల్లో వివాహ పద్ధతులను గణనీయంగా ప్రభావితం చేసే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్ భారతదేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడటమే కాకుండా రెయిన్ హార్వెస్టింగ్ ప్రయత్నాల ద్వారా జీవితాలను కూడా మారుస్తోంది. అక్కడ మహీంద్రా సంస్థ భారీగా మొక్కలు నాటడం ద్వారా భూగర్భంలో జలవనరులు పెరిగాయి. జహీరాబాద్ ప్రజలకు ఇప్పుడు పుష్కలంగా నీరు ఉంది. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది. అక్కడ కుర్రాళ్లకు వివాహ రేటు పెరుగుదలకు ఇది సహకరిస్తోంది, అనే సారాంశంతో ఒక ఆ ప్రకటనను విడుదల చేసారు. అయితే ఈ ప్రకటనలో నటించిన సుజీత్ పెళ్లికి తనను పిలవలేదేమని చరణ్ సరదాగా అడిగారు. ఇక ఆనంద్ మహీంద్రా జహీరాబాద్ లో పెట్టిన మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ వల్ల అక్కడ దాదాపు పదివేలకు పైగా కుటుంబాలకు జీవనాధారం దొరికింది.
https://x.com/AlwaysRamCharan/status/1771505210071855525?s=20
ఇక రామ్ చరణ్ – ఆనంద్ మహీంద్రా ఇద్దరి స్నేహం గురించి తెలిసిందే. గత పదేళ్లలో మంచి ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక లాస్ట్ ఇయర్ ఓ కార్ రేసింగ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చరణ్ అక్కడ సచిన్ టెండూల్కర్ తో కలిసి RRR నుండి `నాటు నాటు` పాటకు ఆనంద్ మహీంద్రాకు చరణ్ ఐకానిక్ హుక్ స్టెప్ నేర్పించారన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఆనంద్ మహీంద్రా దానికి తన కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఈ సరదా అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.