Ram Charan – Allu Arjun : రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య తేడా ఇదే..!!

Ram Charan – Allu Arjun : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నారు.. ఇలా ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి వారు ముందు వరుస లో ఉన్నారు. ఇక మిగిలిన వారు పలు రకాల సినిమాలలో నటిస్తూ పర్వాలేదు అనిపించుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్.

పాన్ ఇండియా హీరోలుగా బన్నీ – చెర్రీ..

ఇలా ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా సక్సెస్ అవుతున్నారు. రోజురోజుకీ రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది.. అల్లు అరవింద్ వారసుడుగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా.. చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తండ్రిని మించిన తనయులుగా పేరు సంపాదించారు. అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా ఉన్న నేపథ్యంలో అప్పుడప్పుడు ఈ హీరోల అభిమానుల మధ్య పలు రకాల గొడవలు కూడా జరుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి.

రామ్ చరణ్ – అల్లు అర్జున్

ముఖ్యంగా మా హీరో గొప్ప అంటే గొప్ప మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ కూడా గొడవ పడుతూనే ఉంటారు.. తాజాగా ఇప్పుడు ఇద్దరు హీరోలకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే అల్లు అర్జున్ లో ఉన్నటువంటి ఒక క్వాలిటీ రామ్ చరణ్ లో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. నటనపరంగా , డాన్స్ పరంగా అభిమానులను సంపాదించుకోవడంలో ఈ ఇద్దరు హీరోలకు సమానమైన క్రేజ్ ఉన్నది..

- Advertisement -

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య తేడా..

కానీ ఒక్క విషయంలో మాత్రం అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ వెనకబడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే చరణ్ ఎప్పుడూ కూడా ఎవరితో ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు లేవు.. కేవలం తన అవసరం మేరకే మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా రామ్ చరణ్ కు సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకోవడానికి పెద్దగా మక్కువ చూపరు.. అయితే అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.. ఏ విషయం అయినా సరే ఓపెన్ మైండెడ్.. తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేస్తూ ఉంటారు..

అలాగే..అల్లు అర్జున్ చాలా రొమాంటిక్ గా ఉంటారని చెప్పవచ్చు.. తన భార్యతో కలిసి ఎన్నోసార్లు రొమాంటిక్గా దిగినటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.. అయితే రాంచరణ్ అలా కాదు.. ఎప్పుడూ కూడా ఉపాసనతో రొమాంటిక్గా దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నటువంటి సందర్భాలు మాత్రం రేర్ అనే చెప్పాలి. ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పుడు స్నేహితుల సమక్షంలో మాత్రమే కాస్త రొమాంటిక్ ఫోటోలను షేర్ చేశారే తప్ప మరి ఎలాంటి సందర్భంలో కూడా ఎలాంటి ఫోటోలను ఆయన షేర్ చేయలేదు. ఇలా ఈ రెండు తేడాలు అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య ఉన్నాయంటూ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు