Jabardasth Rohini : తన జీవితంలో జరిగిన అవమానాలను తెలియజేసిన జబర్దస్త్ రోహిణి..!!

Jabardasth Rohini : మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ లోకి గెస్ట్ గా వచ్చి.. తర్వాత పర్మినెంట్ గా లేడీ కమెడియన్ గా సెటిల్ అయిపోయింది జబర్దస్త్ రోహిణి.. ఇక తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.. మొదట కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ తో పరిచయమైన ఈమె ఆ తర్వాత లేడీ కమెడియన్ గా పాపులారిటీ అందుకున్నది.. జబర్దస్త్ తో వచ్చిన పాపులారిటీతో పలు సినిమాలలో కూడా నటిస్తూ తనదైన కామిడీ టైమింగ్ తో మెప్పిస్తోంది రోహిణి.. అంతేకాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

రోహిణికి బ్రేక్ వచ్చింది ఇక్కడే..

ఇటీవల విడుదలైన సేవ్ ది టైగర్స్-2 లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ వంటి హీరోలకు దీటుగా తన కామెడీతో ఆకట్టుకుంది రోహిణి ( Jabardasth Rohini ). డైరెక్టర్ మహీ వి రాఘవన్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. వీరితోపాటు జోర్దార్ సుజాత, పావని, గంగిరెడ్డి దేవయాని వంటి వారు నటించారు. రోహిణి ఇందులో పనిమనిషిగా నటించింది. మొదటి సీజన్లో రోహిణి – అభినవ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కే హైలెట్గా నిలిచాయి.. ఈసారి సీజన్ 2 కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఆడిషన్ లో అవమానం..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా రోహిణి – అభినవ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరియర్ లో జరిగినటువంటి కొన్ని స్ట్రగుల్స్ గురించి తెలియజేసింది రోహిణి.. కెరియర్ మొదట్లో నేను ఒక ఆడిషన్ కి వెళ్ళాను.. అప్పుడు కొంచెం నల్లగా ఉన్నానని అన్నారు.. దీంతో మేకప్ వెయ్యరా అని అడిగాను.. దాంతో వారు సైలెంట్ గా ఉండడంతో.. మీరు వేరే వాళ్ళని పెట్టుకుంటే పెట్టుకోండి.. నా బెస్ట్ నేను ఇచ్చేశాను అంటూ తెలియజేసిందట.. అయితే అప్పటికే తనకు జాబ్ వచ్చిందని.. సెట్ కాకపోతే జాబ్ కు వెళ్దామని ఫిక్స్ అయ్యానని కూడా తెలిపింది రోహిణి..

- Advertisement -

సీరియల్ లో అవకాశం..

కేవలం అక్కడున్న వారిని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం తనకి లేదని కేవలం నార్మల్ గానే ట్రై చేశాను అని.. వస్తే వస్తుంది లేకపోతే లేదనుకున్నాను అని తెలిపింది. ఏ ఆడిషన్ కి వెళ్ళినా కూడా చాలామంది కలర్ తక్కువగా వుంది అనేవారు కానీ సూపర్ గా నటిస్తున్నావని చెప్పేవాళ్ళు. కానీ అవకాశం మాత్రం ఎవరు ఇవ్వలేదని.. చివరికి తనకు వచ్చిన సీరియల్ ఆఫర్ కూడా లాస్ట్ లో ఎవరు సెట్ కాకపోతే తనకు ఇచ్చారని వెల్లడించింది.. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో మావా అంటూ యాసలో మాట్లాడడం తనకి బాగా పాపులారిటీ తీసుకువచ్చిందని రోహిణి వెల్లడించింది.

ఇప్పటికీ ఆ సీరియల్ డైరెక్టర్ ని నేను గురువుగానే చూస్తానని తనకోసం ఆయన సీన్స్ ఎక్కువగా రాసేవారని.. ఈరోజు ఇలా ఉన్నానంటే అది కేవలం ఆయన వల్లే అని కూడా వెల్లడించింది. ప్రస్తుతం రోహిణి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు