Nandu: మొదటిసారి డ్రగ్స్ కేస్ పై ఎమోషనల్ గా మాట్లాడిన యాక్టర్ నందు..!!

టాలీవుడ్ లో యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ గా పేరు పొందిన నందు తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మంచి టాలెంట్ తో తన కెరియర్ ను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ నటుడు ఎవరో కాదు ప్రముఖ సింగర్ గీతామాధురి భర్త .. అయితే ఇటీవల రెండోసారి తండ్రి అయిన తర్వాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నందు.. ఇందులో తన పై వచ్చిన డ్రగ్స్ కేస్ వల్ల తనకు ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి కూడా తెలియజేశారు. వాటి గురించి చూద్దాం

నా జీవితంలో మాయని మచ్చ అది..

నందు జీవితంలో ఒక విషయం చీకటి మచ్చగా మిగిలిపోయిందట.. అదే డ్రగ్స్ కేస్.. డ్రగ్స్ కేసులో తన పేరు చూసి చాలా టెన్షన్ పడిపోయానని తెలియజేశారు.. ముఖ్యంగా టీవీలలో పదేపదే తన పేరు వేస్తూ.. డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పగా తల్లితండ్రులు, గీతామాధురి చాలా బాధపడ్డారని.. కొన్నేళ్లపాటు మనశ్శాంతి లేకుండా చాలా కష్టాలను కూడా అనుభవించానని తెలియజేశారు నందు.. దీంతో చాలామంది తను డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా భావించగా గీతామాధురి మాత్రమే తనను నమ్మిందని నందు ఎమోషనల్ గా తెలియజేయడం జరిగింది. ఇటీవల జోర్దార్ సుజాత చేసిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు ఇలా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.. డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. తాను డ్రగ్స్ తీసుకోలేదని కేసు కొట్టయ్యగానే చాలా సంతోష పడినట్లుగా తెలియజేశారు.. కానీ అప్పటివరకు బ్రేకింగ్ వేసి తన పేరు ప్రస్తావించిన కొన్ని టీవీ చానల్స్ ఆ కేసు కొట్టేశాక.. ఎక్కడో చిన్నచిన్న అక్షరాలతో స్క్రోలింగ్లో తన పేరు వేశారంటూ వెల్లడించారు..

- Advertisement -

భార్య సపోర్టు వల్లే బయటపడ్డాను..

డ్రగ్స్ కేసు నడుస్తున్న సమయంలో మనకు ఇదంతా అవసరమా? ఇక్కడ నుంచి ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనుకున్నానని తెలియజేశారు నందు. కానీ తన భార్య గీతా మాధురి సపోర్టు తోనే ఈ సమస్య నుంచి బయటపడ్డాను అని వెల్లడించారు.. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉందని అలాగే సినీ లైఫ్ కూడా హ్యాపీగా ఉందని వెల్లడించారు. తన కూతురు కూడా అందరి ముందు మా నాన్న అంటూ చాలా గర్వంగా చెప్పుకోవడం చూసి చాలా గర్వంగా అనిపిస్తోందని తెలిపారు.

నందు వ్యక్తిగత జీవితం..

నటుడు నందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదట తెలుగు సినిమాలలో నటించారు.. ఈ క్రమంలోనే సింగర్ గీతామాధురితో ప్రేమలో పడి ఆ తర్వాత ఆమెను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 2014లో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది.. అప్పటినుంచి చాలా హాయిగా వీరి వైవాహిక బంధం ముందుకు సాగుతోంది. అలా ఒక పాపకు కూడా జన్మనిచ్చిన ఈ జంట ఇటీవలే ఒక బాబుకు కూడా జన్మనిచ్చారు. యాంకర్ గా మారి పలు షో లకి హోస్టుగా చేయడం కూడా తనకు కిక్కిస్తుందంటూ వెల్లడించారు నందు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు