Relationship Tips : గర్ల్ ఫ్రెండ్ కోపాన్ని ఇలా మాయం చేయండి

రిలేషన్ షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిలు ఎమోషనల్ గా చాలా సున్నితంగా ఉంటారు. వాళ్లకు ప్రేమ, కేరింగ్ అనేవి చాలా అవసరం. కానీ రిలేషన్షిప్ ఏదైనాప్పటికీ కొన్నిసార్లు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. సమయానికి ఆ సమస్యను పరిష్కరించకపోతే బంధం బీటలు వారడం మొదలవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు అలక పాన్పు ఎక్కినప్పుడు వాళ్లను ఎలా సముదాయించాలో చాలామంది అబ్బాయిలకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే సాధారణంగా అబ్బాయిలు ఇలాంటి చిన్న చిన్న విషయాలపై పెద్దగా శ్రద్ధ చూపించరు. మరి స్నేహితురాలి కోపాన్ని ఎలా పోగొట్టాలి ? అంటే…

1. కోపానికి కారణం ఏంటి?
గర్ల్ ఫ్రెండ్ కు కోపం వచ్చినప్పుడు చాలా మంది సారీ చెప్పేసి వెళ్లిపోతారు. కానీ అసలు సమస్య ఏంటో, ఆమె కోపానికి కారణం ఏంటో తెలియనప్పుడు క్షమాపణ అడగడం దేనికి? అసలు సమస్య ఏంటో తెలియకపోతే దానికి పరిష్కారం ఎలా కనుగొంటారు? కాబట్టి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఆమె కోపానికి కారణం ఏంటో తెలుసుకొని ప్రేమగా మాట్లాడండి. అయినప్పటికీ కోపం తగ్గకపోతే కొంత సమయం తర్వాత ఆమెకి ఇష్టమైన పువ్వు లేదా చాక్లెట్ ఇచ్చి మళ్లీ మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి.

2. మాట్లాడటం మానేయడం
చాలామంది కపుల్స్ ఏదైనా గొడవ జరిగినప్పుడు సాధారణంగా ఒక తప్పు చేస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అంతా దానంతట అదే సర్దుకుంటుందని అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీకు కోపం వస్తే అవతలి వ్యక్తికి చెప్పండి. అలాగే వాళ్ళకు కోపం వస్తే కారణం ఏంటో తెలుసుకోండి. ఒకరు చెప్పేది మరొకరు ఓపికగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత తప్పు ఎవరిదో తెలుసుకొని సారీ చెప్పి ముందుకు సాగండి.

- Advertisement -

3. గొడవ పడినప్పుడు ఎలా మాట్లాడాలి?
నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తే వాళ్ళ రిలేషన్ షిప్ లో ఈగో ఉండకూడదు. ముఖ్యంగా గొడవపడే సమయంలో దూకుడుగా పదాలను ఉపయోగించకూడదు. అవతలి వ్యక్తి పెంపకం, కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులపై ఎప్పుడూ కామెంట్స్ చేయొద్దు.

4. శృంగారం అనే మెడిసిన్
మీరు ఎంత ప్రయత్నించినా అమ్మాయి కోపం తగ్గట్లేదు అంటే మీ స్వరాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. అంటే మాట్లాడే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఒకవేళ కోపంగా ఉన్న మీ స్నేహితురాలిని శాంతింప చేయాలనుకుని కాల్స్, మెసేజెస్ చేస్తున్నప్పుడు ఆమెతో వాదించే బదులు ప్రేమగా మాట్లాడండి. ఎంత కఠినమైన అమ్మాయి అయినప్పటికీ రొమాంటిక్ టాక్స్ ద్వారా మీ భావాలను కచ్చితంగా అర్థం చేసుకుంటుంది.

5. జోక్స్ తో జాగ్రత్త
సాధారణంగా కోపంగా ఉన్న అమ్మాయి దగ్గర వేసే జోక్స్ రివర్స్ గా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జోక్స్ విషయంలో కూడా బౌండరీస్ దాటకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్లను బాధపెట్టే విధంగా ఆ జోక్స్ ఉండకూడదు.

6. ఇన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ మీ స్నేహితురాలి కోపం ఇంకా తగ్గలేదు అంటే ఆమె గట్టిగా హార్ట్ అయ్యిందని అర్థం. అలాంటప్పుడు వాళ్లను షాపింగ్ కు తీసుకెళ్లండి. షాపింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. పొగడండి. పొగడ్తలకు పడని వారెవ్వరు. సినిమాకి తీసుకెళ్లండి. తను లేకుండా మీరు ఉండలేరన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు