Fasting : ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

బరువు తగ్గడం అనేది ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఉన్న అతిపెద్ద చాలెంజెస్ లో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ఊబకాయం సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బరువు తగ్గడానికి అనేక రకాల డైట్ ప్లాన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలామంది వాటిని ఫాలో అవుతున్నారు కూడా. అందులో ఒకటే ఉపవాసం. చాలామంది అప్పుడప్పుడు ఉపవాసం ఉంటారు. భారతదేశంలో అయితే చాలామంది పండగల సమయంలో ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఈ అడపాదడప ఉపవాసంలో 12 నుంచి 16 గంటల పాటు ఆహారాన్ని ముట్టుకోరు. దీనివల్ల బరువు కంట్రోల్ లో ఉంటుందని చాలామంది నమ్ముతారు. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే…

ఉపవాసం డేంజర్

తాజాగా జరిగిన పరిశోధనలో ఈ ఉపవాసం కారణంగా ఆరోగ్యం డేంజర్ లో పడ్డట్టే అనే విషయం వెళ్లడైంది. అన్ని గంటల పాటు ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యంపై అనేక రకాలుగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. రీసెంట్ గా జరిగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఇలా అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనాలకు బదులుగా తీవ్రమైన అనారోగ్యం ప్రమాదాన్ని పెరుగుతుందని హెచ్చరించారు. ఊహించని విషయం ఏమిటంటే ఉపవాసం అనేది గుండె జబ్బులకు కారణం కావచ్చు. చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్ లో సమర్పించిన డేటా ప్రకారం ఉపవాసం పేరుతో ఆహారం తీసుకోకుండా రోజుకు 12 నుంచి 15 గంటలు ఏమీ తినకుండా ఉండే వ్యక్తులకు తీవ్రమైన ప్రాణాంతక గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 91 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇక ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు ఉపవాసం చేయడం వల్ల మరణించే ప్రమాదం మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రత్యేకించి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రకమైన ఉపవాసం వల్ల గుండెపోటు రావడం లేదా గుండె ఆగిపోయే ప్రమాదం 66% ఎక్కువగా ఉంటుందని తేలిందట.

- Advertisement -

ప్రాణాల మీదకు తెస్తున్న ఫాస్టింగ్…

చైనాలోని జియాగో టోన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవడానికి ఒక పరిశోధనను నిర్వహించారు. 2003 నుంచి 2018 మధ్యకాలంలో 20,000 మంది ఉపవాసం ఉండే అడల్ట్స్ పై ఈ పరిశోధన జరిగింది. అందులో భాగంగానే ఎక్కువ సేపు ఏమి తినకుండా, తాగకుండా లేదా అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నవారికి తీవ్రమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఫాస్టింగ్ అనేది నేరుగా కార్డియోవాస్కులర్ మరణానికి కారణం అవుతుందని పరిశోధనలో వెల్లడి కాలేదు. కానీ ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల కచ్చితంగా గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఇలా అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల బరువు తగ్గించడంలో, కార్డియో మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగానే ఉంటుంది. కానీ బరువు తగ్గడం అనేది స్వల్పకాలిక ప్రయోజనం మాత్రమే. దీర్ఘకాలంలో ఇలా కడుపు కాల్చుకోవడం వల్ల గుండెపై నెగటివ్ ఎఫెక్ట్ పడి, త్వరగా మరణించే రోగాలు వస్తాయని స్పష్టమైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఇప్పటి నుంచి ఉపవాసం ఉండేవారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు