Actor Nandu: గొప్ప మనసు చాటుకున్న నటుడు నందు..ఏకంగా 800 మంది కోసం..!

Actor Nandu

ప్రముఖ నటుడు.. ఒకవైపు బుల్లితెర స్టార్ యాంకర్ గా మరొకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న నందు.. ఐపీఎల్ లాంటి ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్లలో కూడా స్పోర్ట్స్ యాంకర్ గా కూడా తన టాలెంట్ ని చూపిస్తున్నాడు.. సుమారుగా 25 కి పైగా సినిమాలలో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న నందు ఇటీవల తాను నటించిన మ్యాన్షన్ 23 , వధువు వంటి వెబ్ సిరీస్ లకు ఓటీటీ లలో మంచి పేరు లభించింది. ఇక సినిమాల పరంగా , కెరియర్ పరంగా బిజీగా ఉన్న నందు వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. ప్రముఖ సింగర్ గీతామాధురిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇకపోతే త్వరలో ఈయన తండ్రిగా మరోసారి ప్రమోషన్ పొందనున్నారు.

ఇటీవలే గీతామాధురి సీమంతం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది .. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా గీతామాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరి ఈ విశేషమో లేక మరేదైనా సందర్భమో తెలియదు కానీ ఒక మంచి పని చేసి అందరి మనసులు గెలుచుకున్నారు. తాజాగా అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చి గొప్ప మనసు చాటుకున్నారు.. తాజాగా శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్థన చేసిన నందు 800 మందికి ఆహారాన్ని అందించారు.. అంతేకాదు తాజాగా ఆయనే స్వయంగా వండి అందరికీ వడ్డించారు..

అన్నదానం తర్వాత కూడా పాత్రలు కడిగారు.. యాక్టర్ అన్న ట్యాగ్ ను పక్కనపెట్టి సామాన్యుడిగా ప్రతి పనిలోనూ చేయి అందించి తన మంచి మనసున్న చాటుకున్నారు నందు.. ప్రస్తుతం అన్నదానానికి సంబంధించిన వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నందు మంచితనం అలాగే అతని సింప్లిసిటీని చూసి ప్రముఖులు , అభిమానులు, నెటిజనులు కూడా ఫిదా అవుతున్నారు. అన్నదానం చేసి గొప్ప మనసు చేసావ్ అంటూ నందూ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే 2014లో సింగర్ గీతామాధురిని ప్రేమ వివాహం చేసుకున్న నందు 2019లో దాక్షాయని ప్రకృతి అనే అమ్మాయికి జన్మనిచ్చారు.. ఇప్పుడు మరొకసారి కొడుకుకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు