Amazon Prime : వివాదంలో అమెజాన్ ప్రైమ్… కోర్టుకెక్కిన సబ్స్క్రైబర్

Amazon Prime

ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజ్ అయిన నెలా, రెండు నెలలలోపే సినిమాలు ఓటీటీలో ప్రసారం అవుతుండడం, టీవీలో, ఫోన్ లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూసే అవకాశం ఉండడం సినీ ప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాను రానూ ఓటీటీకి పెరుగుతున్న పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆయా ఫ్లాట్ ఫామ్స్. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు వేసిన ప్లాన్ తో చిక్కుల్లో పడింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ సబ్స్క్రైబర్లతో టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా దూసుకెళ్తున్న అమెజాన్ ప్రైమ్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ లో లోపాలు ఉన్నాయంటూ చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న అమెజాన్ నిరాటంకంగా సినిమాలు, వెబ్ షోలు స్ట్రీమింగ్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి తన సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ఓ ప్లాన్ ను ప్రవేశపెట్టింది అమెజాన్. ఇదివరకే ఫ్రీ యాడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న సబ్స్క్రైబర్ కు మళ్ళీ యాడ్ ఫ్రీ అంటూ అదనపు చార్జీలు వేసి తాను తీసుకున్న గోతిలో తానే పడింది ఈ ఓటీటీ సంస్థ. అమెజాన్ చేసిన ఈ పనికి కోపం కట్టలు తెచ్చుకున్న సబ్స్క్రైబర్ డైరెక్ట్ గా కోర్ట్ మెట్లు ఎక్కాడు. అమెజాన్ సంస్థ తన ప్రైమ్ మెంబర్స్ ను తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఓ సబ్స్క్రైబర్. ఈ ఘటన అమెరికాలో జరగగా, గత డిసెంబర్లో ఏడాదికి సరిపడా యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకోగా, తనను మళ్ళీ యాడ్ ఫ్రీ చూడాలంటే అదనంగా డబ్బులు పే చేయమని అడుగుతున్నారంటూ కోర్టులో కేసు వేశాడు.

యూఎస్ లోని కాలిఫోర్నియాకు చెందిన విల్బర్ట్ నెపోలియన్ అనే వ్యక్తి అమెజాన్ సంస్థపై ఏకంగా 18 పేజీల పిటిషన్ వేశారు. అందులో ఆయన ఈ ఓటిటి సంస్థ వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించిందని, తమ లాభం కోసం యాడ్ ఫ్రీ అనే పేరుతో సబ్స్క్రైబర్లపై అదనపు భారం మోపుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే యాన్యువల్ గా ఉన్న చార్జెస్ ని ప్రపంచ వ్యాప్తంగా పెంచేశారని తెలియజేశారు. ఇదే కష్టం అనుకుంటే… మళ్లీ సబ్స్క్రైబర్ల భుజాలపై మరింత భారం మోపుతూ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ లో కూడా యాడ్స్ వేస్తామని, మళ్లీ యాడ్స్ లేకుండా చూడాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని కండిషన్ పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇది మోసం అంటూ తన అవేదనను వ్యక్తం చేసిన పిటిషనర్ వెంటనే అమెజాన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ ఇంకా ఈ విషయం గురించి స్పందించలేదు. ఇక ఈ కొత్త ప్లాన్ ను అమెజాన్ గత జనవరి 29 నుంచి స్టార్ట్ చేసింది. కొత్త సబ్స్క్రైబర్ ల కోసం అమెజాన్ యాడ్ టైర్ ను డిఫాల్ట్ గా మార్చింది. అది కాస్తా పాత సబ్స్క్రైబర్లపై ఎఫెక్ట్ చూపించింది. ఇప్పటికే యాడ్ ఫ్రీ యాన్యువల్ ప్లాన్ తీసుకున్న వారికి కూడా ఫ్రీ యాడ్ కోసం అదనంగా చెల్లించాలని చూపించడంతో ఈ వివాదం మొదలైంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు