Best Old Love Story Movies: ఆ నాటి ప్రేమలు చూపులతోనే మొదలు..

Best Old Love Story Movies

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే అనే అందరికి తెలిసిందే. అంటే “ప్రేమికుల రోజు”. ప్రేమికులు తాము ప్రేమించే వ్యక్తికీ తమ ప్రేమను వ్యక్త పరిచే రోజు. వాలెంటైన్ అనే వ్యక్తి ప్రేమ సందేశానికి గుర్తుగా ఎక్కడో రోమ్ లో మొదలైన ఈ ఫెస్టివల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ వాలెంటైన్స్ డే ని వ్యతిరేకించే వారు లేకపోలేరు. ఇండియాలో అయితే పెళ్ళికి ముందే ప్రేమ పేరుతో తప్పటడుగులేస్తారని చాలా మంది వ్యతిరేకిస్తారు. అందులోనూ వాస్తవం ఉన్నా, మెచ్యూరిటీ లేని లవ్ లెక్కలోకి రాదంటారు కొందరు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజుల్లో ప్రేమ అంటే ఒకరోజులో చూసి, వారంలో ప్రొపోజల్, నెలలో పెళ్లి, (ఒక్కోసారి పెళ్ళికి ముందే హద్దు దాటడం) ఏడాదిలో అయితే పిల్లలు, లేదా విడాకులు అనేలా తయారయింది యువత పరిస్థితి. దానికితోడూ ఆడియన్స్ ఇవే కోరుకుంటున్నారు అని భావించి, రియల్ స్టోరీలు అన్న పేరుతో జనాలకు రుద్దడానికి బేబీ లాంటి సినిమాలతో ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ నచ్చేలా “సీతారామం” లాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ కూడా అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటాయి.

ఇలా ప్రేమికుల రోజు నేపథ్యంలో ఆరోజుల్లో లవ్ గాని, లవ్ ప్రపోజల్ గాని ఎలా ఉంటుందో మచ్చుకు కొన్ని సినిమాల ద్వారా తెలుసుకుందాం.

1. పాతాళభైరవి : (50స్)

- Advertisement -

ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అని చాలా మందికి తెలీదు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. తాను ప్రేమించే అమ్మాయికోసం కోట మేడలు దాటొచ్చి, అమ్మాయిని ప్రేమించేవాడు. ఆ అమ్మాయికోసం లైఫ్ రిస్క్ చేసి ఎంత వరకైనా వెళ్ళేవాడు. ఆ క్రమంలో ప్రాణాలు కూడా లెక్కచేయలేదు. ఇలాంటి సినిమాల ప్రేరణతోనే అప్పట్లో జానపదాల్లోనూ ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి. అందుకే అప్పట్లో ‘కోటలో రాణి కోసం రాజు గుర్రంపై ఎగురుకుంటూ వచ్చి తీసుకెళ్తాడు’ అనేవారు.

2. మూగ మనసులు : (60స్)

మామూలుగా ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇది ప్రేమ అని తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. కానీ అది ప్రేమ అని తెలిసి తాము ప్రేమించిన వాళ్లకు తమ ప్రేమ వ్యక్త పరిచేలోపే తమ ప్రేమను ఏదో ఒకవిధంగా కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఎవర్నైనా ప్రేమిస్తే నిర్భయంగా చెప్పేయాలి. అది నిజమైన ప్రేమే అయితే కాలమే వాళ్ళని కలుపుతుందంటారు. ఆ కాన్సెప్ట్ తోనే వచ్చిందే ఈ మూగ మనసులు. ఈ చిత్రంలో ప్రేమికులు ఒకరినొకరు ప్రేమించుకున్నా ఆ ప్రేమను సమయానికి వ్యక్తపరచనందున ఆ ప్రేమను కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళది నిజమైన ప్రేమ కాబట్టే కాలం చావులో కలిపి, మరు జన్మలో బతికించింది.

3. సుస్వాగతం : (90స్)
చాలా మంది ఈ సినిమా ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ ప్రేమతో పాటు జీవితంలోనూ సక్సెస్ కావాలని, అమ్మాయి ప్రేమ ధ్యాసలో పడి అంతకంటే గొప్ప తల్లిదండ్రుల ప్రేమను కోల్పోవద్దని, అన్నిటికి మించి జీవితంలో కొన్ని కోల్పోతే తిరిగి రావని, ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించి యువతకి ప్రేమ పాటల్లోనే జీవిత పాఠాలు నేర్పిన సినిమా ఇది. 90స్ లో కుర్రాళ్ళు రియల్ లైఫ్ లో ఎలా ఉండేవారో, అప్పట్లో తమ ప్రేమను వ్యక్త పరచడానికి ఎంత తపన పడేవారో, ఆ ప్రేమ దక్కడానికి ఏళ్ళ తరబడి ఎలా నిరీక్షించే వారో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఫెయిల్యూర్ సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ ఎండింగ్ ఉన్న సినిమా ఇది.

4. నువ్వు వస్తావని :

ప్రేమకు నిర్వచనం త్యాగం అని పెద్దలంటుంటారు. ఎవర్నైనా ప్రేమించినపుడు వాళ్ళ నుండి తిరిగి ఏమి ఆశించకుండా నిస్వార్ధంగా వాళ్ళ క్షేమం కోరి, కష్టాల్లోనూ తోడుగా ఉండడమే నిజమైన ప్రేమ అని ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాలో చిన్ని ని ఇందు తెలీకుండా ద్వేషించినా కూడా, ఆ అమ్మాయి క్షేమమే కోరుకునే చిన్ని తానే కృష్ణ అనే నిజం చెప్పకుండా కష్టాల్లో తోడుగా నిలుస్తాడు. ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తే, ఆ ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం ఎలా చాలో, ఎన్ని అపార్ధాలు వచ్చినా వాళ్ళు కలవడానికి కూడా ఒక్క క్షణం చాలు ఈ సినిమా చెప్తుంది.

ఇక ఇవే కాకుండా 90స్ లో ప్రేమించుకుందాం రా, శీను, తొలిప్రేమ, నువ్వే కావాలి లాంటి సినిమాలు కమర్షియల్ గా మంచి లవ్ స్టోరీస్ గా నిలిచాయి.

అయితే ఇలాంటి లవ్ స్టోరీస్ లో ఈ జెనరేషన్ ఆడియన్స్ కి నచ్చేలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఏది అంటే “సీతారామం” సినిమా అని చెప్పాలి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెప్పడం కన్నా చూసి ఆస్వాదిస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు