Valentine’s Day 2024 Movies : ప్రేమకున్న పవర్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమాలు ఇవే

Valentine’s Day 2024 Movies

ప్రేమకు ఉండే పవర్ తో ప్రపంచాన్నే గెలిచేస్తామనే నమ్మకం వచ్చేస్తుంది ప్రేమికులకు. అదే పవర్ ఫుల్ కంటెంట్ తో సినిమాలు వస్తే ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో అలనాటి దేవదాసు నుంచి నిన్నటి బేబీ దాకా వచ్చిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈరోజు ప్రేమకు ఉన్న పవర్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

దేవదాసు
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన భగ్న ప్రేమికుల కథ “దేవదాసు”. 1953లో వచ్చిన ఈ సినిమాకు భారతీయ సినీ చరిత్రలోని ప్రేమ కథల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ మూవీ ఇప్పటికీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న లవ్ స్టోరీ గా కొనసాగుతోంది.

గీతాంజలి
అక్కినేని నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన అందమైన ప్రేమ కావ్యం “గీతాంజలి”. క్యాన్సర్ బారిన పడిన ఒక అమ్మాయి, అబ్బాయి చివరి రోజుల్లో ప్రేమలో పడి, బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారనే అద్భుతమైన లైన్ తో తీర్చిదిద్దిన ఈ సినిమా సినీ చరిత్రలో ఒక అందమైన ప్రేమ కావ్యంగా మిగిలింది.

- Advertisement -

ప్రేమదేశం, ప్రేమికుడు
90ల నాటి యూత్ లైఫ్ పై గట్టి ప్రభావం చూపించిన లవ్ స్టోరీస్ లో “ప్రేమదేశం”దే ఫస్ట్ ప్లేస్. టబూ, అబ్బాస్, వినీత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసింది. నగ్మా, ప్రభుదేవా కలిసి నటించిన “ప్రేమికుడు” సినిమా కూడా ప్రేమికుల రోజు ప్రత్యేకమే.

ప్రేమికుల రోజు
కునాల్, సోనాలి బింద్రే జంటగా నటించిన లవ్ స్టోరీ “ప్రేమికుల రోజు”. ఒకరినొకరు చూసుకోకుండానే, కంప్యూటర్ ద్వారా పరిచయాలు చేసుకొని, ఆ తర్వాత ప్రేమలో మునిగిపోయే జంట కథే ఇది. ఈ మూవీ ప్రేమికులకు ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.

ఆరాధన
మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ “ఆరాధన”కు అప్పట్లో మంచి ఆదరణ దక్కింది.

ప్రేమ
వెంకటేష్, రేవతి జంటగా నటించిన “ప్రేమ” సినిమా కూడా కల్ట్ లవ్ స్టోరీ అనే స్టేటస్ ను అందుకుంది. సురేష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

తొలిప్రేమ
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ కల్ట్ లవ్ స్టోరీ ఇప్పుడు రీ రిలీజ్ అయినా ఆదరణ ఏమాత్రం తగ్గదు.

ప్రేమకు జాతి, కులం, ఆస్తులు అంతస్తులతో సంబంధం లేదని చాటి చెప్పిన సినిమాల్లో ఉదయ్ కిరణ్ నువ్వు నేను ముందు వరుసలో ఉంటుంది. ఇక 7/G బృందావన కాలనీ, ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ఓయ్ వంటి విషాదంతా ప్రేమకథలు, సూర్య s/o కృష్ణన్ కూడా కల్ట్ సినిమాల లిస్టులో చేరిపోయాయి.

ఇక ప్రేమకున్న పవర్ ను చూపించిన ఈతరం లవ్ స్టోరీస్ విషయానికొస్తే… ఏ మాయ చేసావే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సీతారామం, బేబీ వంటి సినిమాలు ఉన్నాయి. ఇంకా నువ్వొస్తానంటే నేనొద్దంటానా కూడా అందమైన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఒకటి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు