Rashmika Mandanna : శర్వా, రష్మికపై నెటిజన్ షాకింగ్ కామెంట్స్… హీరోయిన్ ఘాటు రియాక్షన్

Rashmika Mandanna

సెలబ్రిటీలపై రూమర్స్ రావడం సర్వసాధారణం. చిన్న చిన్న రూమర్లను వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ అవి హద్దులు దాటినప్పుడే స్టార్స్ సహనం నశించి, ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా హీరో శర్వానంద్ తో కలిపి రష్మిక చేసిన సినిమా గురించి కామెంట్ చేసిన నెటిజన్ పై తీవ్రంగా మండిపడింది రష్మిక. ఇంతకీ ఈ హీరోయిన్ కోపం తెప్పించిన ఆ రూమర్ ఏంటి? అంటే…

నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. రీసెంట్ గా “యానిమల్” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ సక్సెస్ ను ఇంకా ఎంజాయ్ చేస్తోంది రష్మిక. జనవరి 26న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన “యానిమల్” మూవీ ఓటీటీలోను రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక “పుష్ప 2” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు “రెయిన్ బో” అనే తమిళ సినిమా, “ది గర్ల్ ఫ్రెండ్” అనే తెలుగు సినిమా కూడా చేస్తోంది. మరోవైపు “చావా” అనే హిందీ పీరియాడికల్ మూవీలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ గా ఉంటున్నారు రష్మిక. తనపై వచ్చే అనవసరమైన రూమర్లకు వెంటనే క్లారిటీ ఇచ్చేస్తుంది. రీసెంట్ గా రష్మిక 4 కోట్లకు పైగా పారితోషకం పెంచింది అంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ, సెటైరికల్ గా అది అబద్ధం అని తేల్చి పారేసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ట్విట్టర్ లో ఫాన్స్ తో చిట్ చాట్ చేసిన రష్మికకు అభిమాని నుంచి ఎదురైన ప్రశ్న కోపం తెప్పించింది. సదరు నెటిజన్ “నాకు ఆడవాళ్లు జోహార్లు స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం కిషోర్ తిరుమల, శర్వానంద్ కోసమే చేశాను – రష్మిక మందన్న” అంటూ దాని రష్మిక అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనికి మూడీగా ఉన్న వీడియోను జత చేస్తూ రష్మిక తీవ్రంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

అతని కామెంట్ కు రష్మిక “ఎవడ్రా నీకు చెప్పింది?” అంటూ ఫైర్ అయ్యింది. తాను స్క్రిప్ట్ నమ్మే సినిమాలు చేస్తానని, సినిమాలో నటీనటులు ఇతర సిబ్బందితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తానని ఈ సందర్భంగా రష్మిక తెలియజేసింది. అయితే ఇలాంటి ఆధారాలు లేని వార్తలు అసలు ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కావడం లేదు అంటూ ఫైర్ అయ్యింది. ఇక శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ,ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా 2022లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో రష్మిక ఇలాంటి కామెంట్స్ చేసినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని రష్మిక దృష్టికి తీసుకెళ్లిన అభిమానితో ఆ కామెంట్స్ గురించి తీవ్రంగా స్పందించింది ఈ నేషనల్ క్రష్.

Rashmika Mandanna fires on netizen

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు