Rashmika: రష్మిక మందన్నాకి ఆ పాడు అలవాటు ఉందా..? బాత్రూంలో కూడా !

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాల లిస్టులో ఒకరిగా చేరింది. పుష్ప సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాదు, పుష్ప రిజెల్ట్ తో ఈ అమ్మడు తమిళ, హిందీ సినిమాలలో సైతం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది.

అంతేకాకుండా రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ అమ్మడికి క్రేజ్ పెరిగే కొద్దీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేస్తుందట. యానిమల్ సినిమా కోసం రష్మిక భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ చిత్రం గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటించిన అందుకుగాను రూ. 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకుందట. ఇక రష్మిక ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ ని వసూలు చేస్తుందట.

దీంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా టాలీవుడ్ దర్శకనిర్మాతలు రష్మిక తన రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోవాలని అంటున్నారట. ఇక రష్మిక ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. యాడ్ లలో కూడా నటిస్తూ భారీగానే డబ్బులను సంపాదిస్తుంది. ఇక రష్మిక ఒక నెలకు గాను రూ. 80 నుంచి 90 లక్షల రూపాయలను సంపాదిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇలా రష్మిక భారీగానే ఆస్తులను కూడా బెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇదంతా పక్కకు పెడితే… రష్మిక గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్‌ మీడియా హాట్‌ టాపిక్‌ గా మారింది. నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఫోన్‌ వాడటం బాగా అయిందట. బాత్రూం కు వెళ్లినా కూడా ఫోన్‌ తీసుకుని పోతుందట నేషనల్ క్రష్ రష్మిక మందన. డాక్టర్స్‌ ఎంత సూచనలు చేసినా.. ఈ అలవాట మానడం లేదట. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యామా అంటూ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీలు కూడా ఈ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. గతంలో మహేష్ బాబు కూడా ఫోన్ కు అడిక్ట్ అయినట్టు ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక కూడా ఫోన్ వాడకానికి ఎక్కువే టైం కేటాస్తుందని తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు