Rashmika: రష్మిక టాటూ ల వెనుక ఇంత కథ ఉందా..?

Rashmika

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అదేమిటంటే ఆమె చేతులపై రెండు టాటూ లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే వాటిల్లో ఒకటి చేతి మణికట్టు పై ఉండే టాటూ తరచుగా కెమెరాకు చిక్కుతుంది.. కానీ మరో పచ్చబొట్టు మాత్రం ఎక్కడ కనిపించలేదని చెప్పాలి. ఇంకో పచ్చబొట్టు ఎక్కడుందో? దాని అర్థం ఏంటో? ఇప్పుడు చూద్దాం..

ఇకపోతే రష్మిక మందన్న చేతి పై తరచుగా కనిపించే పచ్చబొట్టు ఒకటి.. భర్తీ చేయలేనిది ( Irreplaceable) అని ఈ పచ్చబొట్టు వేయించుకుంది.. అయితే ఈ పచ్చబొట్టు అర్థాన్ని కూడా రష్మిక ఒకసారి వివరించింది.. మనలో ప్రతి ఒక్కరూ ఎవరికీ నచ్చినట్లుగా వారు ప్రత్యేకంగా ఉంటారు.. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని మరొక వ్యక్తితో భర్తీ చేయలేరు అంటూ దీనిపై వివరణ ఇస్తూనే ఈ టాటూ ని చూపించింది రష్మిక. ఈ టాటూని తాను కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే వేయించుకున్నానని తెలిపింది. ఇకపోతే ఈమె చేతిలో మరొక రహస్య పచ్చబొట్టు కూడా ఉంది. ఇంతకు ఆ పచ్చబొట్టు ఎక్కడుంది..? దాని అర్థం ఏమిటి అంటే..? ఆ పచ్చబొట్టు కుడి చేతి మిడిల్ ఫింగర్.. వేలి కీలు పైన ఉంది.. ఈ పచ్చబొట్టును తీక్షనంగా గమనిస్తే తప్ప బహిర్గతం కాదు అని చెప్పవచ్చు.. ఇక దీని అర్థం అనంతానికి చిహ్నం అంటే అంతం లేనిది అని అర్థం.

ఇక అలా ఈ రెండు టాటూలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.. ప్రతిసారి కూడా ఆమె అభిమానులు రష్మిక టాటూ ని జూమ్ చేసి చూస్తూ ఉంటారు. ఇక అదే ఇన్ఫినిటీ సింబల్ ఆమె వేయించుకుంది. మొత్తానికి అయితే ఈ రెండు టాటూలు వైరల్ గా మారుతున్నాయి ఇకపోతే రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలోనటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే షూటింగ్ కూడా శరవేగంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు