Lal Salaam Collections : ఇది ఊహించలేదు. కెరీర్ లో లోయెస్ట్ ఓపెనింగ్స్.!

కోలీవుడ్ సూపర్ స్టార్ ప్రత్యేక పాత్రలో నటించిన “లాల్ సలాం” సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తూ ఫైనల్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాపై ముందు నుండి పెద్దగా అంచనాలు లేవు. రజిని ప్రత్యేక పాత్రలో నటించాడన్న ఒక్క రీసన్ తప్పితే ఏ ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేని ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా కూడా పెద్దగా కథేమి లేదని నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అన్నటికి మించి లాల్ సలాం సినిమాకు డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయి.

సాధారణంగా ఒక స్టార్ హీరో ఓ సినిమాలో స్పెషల్ రోల్ గాని, లేదా కీలక మైన ప్రత్యేక పాత్ర గాని చేస్తే, ఆ సినిమా మీదున్న అంచనాలు పదింతలవుతాయి. అంతవరకు ఎందుకు రజినీకాంత్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చిన్న గెస్ట్ రోల్స్ చేస్తేనే ఎంత భారీ ఓపెనింగ్స్ వచ్చాయో చూసాం. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటించిన బ్రో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. కానీ లాల్ సలాం మాత్రం చాలా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకోగా, ఫస్ట్ డే కలెక్షన్లు లెక్కేస్తే తమిళ నాడు మొత్తం కలిపినా 5 కోట్ల గ్రాస్ రాగా, తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణంగా 20 లక్షల గ్రాస్ ఓపెనింగ్ మాత్రమే దక్కింది. ఇక వరల్డ్ వైడ్ గా 7 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ మాత్రమే అందుకున్న లాల్ సలాం, సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల వీకెండ్ లో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప పుంజుకోవడం కష్టం.

లాల్ సలాం సినిమా లో రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించినప్పటికీ గంటన్నరకు పైగానే సినిమాలో ఉంటాడు. అయితే లాల్ సలాం రజిని కాంత్ కెరీర్ లోనే తక్కువగా అంటే 15 ఏళ్ళ కింద వచ్చిన ‘కుసేలన్’ (కథానాయకుడు) తర్వాత అంతటి లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, ఆ సినిమా తర్వాత అంతటి దారుణమైన ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమా గా లాల్ సలాం నిలిచింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు