Teaser Talk: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇన్స్పైరింగ్ గా “లాల్ సలాం”!

ఈ సంక్రాంతికి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో తెలుగు తో పాటు పలు తమిళ్ సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “లాల్ సలాం” కూడా ఒకటి. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంప్రెస్ చేయగా, ఈ సినిమా కమర్షియల్ సినిమాగానే తెరకెక్కుతుందని అనుకున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక అందరి అంచనాలు తారుమారయ్యాయి. టీజర్ ఊహించిన దానికి వేరేలా ఉన్నా కాన్సెప్ట్ చాలా బాగుంది.

ఇక వివరాల్లోకి వెళితే “లాల్ సలాం” టీజర్ కాసేపటిక్రితమే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. టీజర్ ని చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంచి పాయింట్ తో కథని తీసుకున్నారని చెప్పొచ్చు. క్రికెట్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు ఊళ్ళ మధ్య మత కక్ష్యలతో ఉండే ప్రజల మధ్య క్రికెట్ ని మెయిన్ గా చూపిస్తూ సినిమా రూపొందించారు. కథ ఏమి రివీల్ చేయకపోయినా, కాన్సెప్ట్ విషయంలో మాత్రం జనాలకి ఒక ఐడియా వచ్చేసింది.

- Advertisement -

స్పోర్ట్స్ విభాగంలో చాలా చోట్ల చూపించే ప్రాంతీయాభిమానం, ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ లాంటి సున్నితమైన అంశాలని ఈ సినిమా లో చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక “మొయిద్దీన్ భాయ్” గా రజినీకాంత్ ఎంట్రీ కూడా సూపర్ అని చెప్పాలి. కొసమెరుపేంటంటే టీజర్ లో ఒక షాట్ లో లెజెండరీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ కనిపిస్తారు. అయితే ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో గెస్ట్ గా కనిపించనున్నారు.

అయితే టీజర్ టెక్నికల్ గా అంత ఇంప్రెసివ్ గా లేదని అనిపిస్తుంది. టీజర్ క్వాలిటీ కొంచెం లో గా ఉందని అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ బిజిఎం ఊహించినంత లేదు. కానీ సినిమా మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని ఇచ్చింది. ఇక “లాల్ సలాం” సినిమాని పొంగల్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు