Rashmika Mandanna: రెమ్యూనరేషన్ వార్తలపై రష్మిక ఘాటు రియాక్షన్

Rashmika Mandanna

పుష్ప, యానిమల్ వంటి పాన్ ఇండియా సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రష్మిక ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అందుకే ఈ నేషనల్ క్రష్ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతోంది. ప్రస్తుతం హీరోయిన్ గా రష్మిక కెరియర్ పీక్స్ లో ఉంది. ఈ వరుస సక్సెస్ లను ఎంజాయ్ చేస్తున్న రష్మికను తాజాగా వచ్చిన రెమ్యూనరేషన్ రూమర్స్ అప్సెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. అందుకే ఆ వార్తలు పై ఘాటుగా స్పందించింది ఈ బ్యూటీ. ఇంతకీ ఆ రూమర్స్ ఏంటి? వాటిపై రష్మిక ఎలా స్పందించింది? అంటే…

రీసెంట్ గా “యానిమల్” మూవీతో 900 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది రష్మిక. ఈ నేపథ్యంలోనే ఆమె పారితోషకం గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. “యానిమల్” సక్సెస్ తో రష్మిక తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందని, ఇప్పుడు ఒక్కో సినిమాకు 4-4.5 కోట్ల పారితోషకం వసూలు చేస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా రష్మిక సెటైర్లు వేసింది. ఓ వెబ్సైట్ తన రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావిస్తూ వేసిన ట్వీట్ పై రష్మిక స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

సదరు వెబ్సైట్ “యానిమల్” సక్సెస్ తర్వాత రష్మిక తన రెమ్యూనరేషన్ ను మళ్ళీ పెంచేసిందని, ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 4 కోట్ల నుంచి 4.50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందని రాసుకొచ్చారు. ఆ పోస్ట్ క్షణంలోనే వైరల్ కావడంతో రష్మిక స్పందిస్తూ ఇదంతా చూసిన తర్వాత నిజంగానే అలాగే చేయాలనిపిస్తోందని కామెంట్ చేసింది. ప్రొడ్యూసర్లు ఎందుకు ఇంత పారితోషకం డిమాండ్ చేస్తున్నావని అడిగితే మీడియా ఇదే చెబుతోంది, వాళ్ళు చెప్పింది నేను నిజం చేయాలి కదా అని సమాధానం ఇస్తానంటూ ట్వీట్ చేసింది రష్మిక. ఇలా ఒక్క సెటైరికల్ పోస్ట్ తోనే తన పారితోషకంపై వస్తున్న వార్తలు అబద్ధమని తేల్చేసింది.

- Advertisement -

Rashmika Mandanna satirical post on remuneration rumours

ఇదిలా ఉండగా రీసెంట్ గా రష్మిక “యానిమల్” సినిమాలో గీతాంజలిగా కనిపించి అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. పుష్ప సీక్వెల్ “పుష్ప 2” మూవీతో ఈ ఏడాది ఆగస్టు 15న ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రష్మిక చేతిలో రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే సౌత్ సినిమాలు, చావా అనే ఒక హిందీ పీరియాడికల్ మూవీ ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు