Rashmika Mandanna : రష్మికను చిన్నచూపు చూస్తున్న నార్త్… ఫిలింఫేర్ అవార్డ్స్ తో డిసప్పాయింట్

భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా ఒకటి. ట్యాలెంట్ ఉన్న నటీనటులు ఈ అవార్డులను అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం అవార్డులు ఇచ్చే విధానంపై కొంతమంది హీరోహీరోయిన్ల అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో రష్మిక మందన్న చేరిపోయారు. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023 వేడుకలో రణబీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకోగా, అలియా భట్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. విధు వినోద్ చోప్రా “12వ ఫెయిల్” మూవీకి గానూ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్నారు.

అయితే ఈ అవార్డులపై ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఉత్తమ నటుడి అవార్డు రణబీర్ కపూర్‌కు బదులుగా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కు రావాల్సింది అని ఆయన అభిమానులు భావించారు. సోషల్ మీడియాలో విషయంపై చర్చ కూడా నడిచింది. ఇక తాజాగా రష్మిక మందన్న విషయంలో కూడా ఆమె అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. “యానిమల్‌”లో రణబీర్ కు జోడిగా నటించిన రష్మిక మందన్న, ఈ మూవీలో తన నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “యానిమల్‌”లో రష్మిక తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచింది. ఈ చిత్రంలో నటించిన రణబీర్ కపూర్, బాబీ డియోల్ లకు ఏమాత్రం తీసిపోకుండా నటించింది రష్మిక. అయితే ఆమెను పక్కన పెట్టేసి అలియా భట్ కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఇవ్వడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

“రాకీ ఔర్ రాణి కి కహానీ” మూవీలో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ఉత్తమ నటి అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి ఏ మూవీలో ఆమెది పెద్ద ఛాలెంజింగ్ పాత్రేమీ కాదు. నటనకు అంతగా స్కోప్ లేని పాత్రను పోషించిన అలియాను ఉత్తమ నటిగా ప్రకటిస్తూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఇవ్వడంపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక బాలీవుడ్ హీరోయిన్ కాదు కాబట్టి ఆమెను కావాలనే చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 900 కోట్లు కొల్లగొట్టి రచ్చ చేసిన “యానిమల్” మూవీలో అద్భుతమైన నటనను కనబరిచిన రష్మిక కనీసం నామినేట్ కూడా కాకపోవడం నిజంగా ఆమెను నిరాశ పరిచే విషయమే.

- Advertisement -

నటీనటుల కెరీర్‌లో అవార్డులు అనేవి చాలా ముఖ్యమైనవి. తమ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచినప్పుడు గౌరవాన్ని పెంచే అవార్డులను ఆశించడం మామూలే. అవార్డులు ఇచ్చేది కూడా ట్యాలెంట్ ఉన్న నటీనటులకు మరింత ప్రోత్సాహం అందించడానికే. మై అలాంటప్పుడు అవార్డుల విషయంలో ఇలాంటివి జరిగితే వాటి మీద గౌరవం తగ్గుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈసారి రష్మిక కన్నా అలియా ఏ రకంగా వీళ్లకు బెటర్ అనిపించిందో ?

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు