Koratala Shiva: మీ కష్టం పగోడుకి కూడా రాకూడదు శివ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హిట్టు ప్లాప్ అనేవి కామన్. ఒక సినిమా హిట్ పడితే ఆ దర్శకుడికి అనేక ప్రొడక్షన్ నుంచి చాలా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదే ఆ దర్శకుడికి ప్లాప్ పడితే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇకపోతే కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసే అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. మిర్చి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. బాహుబలి కంటే ముందు వచ్చిన ఈ సినిమాపై అంతగా ఎవరికీ అంచనాలు లేవు.

కానీ మామూలు సినిమాగా వచ్చిన మిర్చి అద్భుతమైన హిట్ సాధించి దర్శకుడుగా కొరటాల శివను నిలబెట్టింది. ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపించి అద్భుతమైన ఫైట్స్ అండ్ డిజైన్ చేసి ప్రభాస్ అభిమానులకు ఒక మాస్ కమర్షియల్ సినిమాను అందించాడు కొరటాల శివ. మిర్చి సినిమా ఆ తర్వాత మహేష్ బాబు లాంటి హీరోతో సినిమాను చేసే అవకాశం కూడా తెచ్చిపెట్టింది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన రెండవ సినిమా శ్రీమంతుడు. శ్రీమంతుడు సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు పైగా మార్కెటింగ్ చేసి అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కొరటాల శివను కూడా ఒక స్టార్ దర్శకుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. అయితే విజయం వెనక వివాదాలు వస్తాయి అన్నట్లు అప్పటినుంచే కొరటాల శివ కి శ్రీమంతుడి విషయంలో ఒక వివాదం ఎదురైంది. ఆ సినిమా తన పుస్తకానికి కాపీ అంటూ శరత్ చంద్ర అనే ఒక రైటర్ అప్పట్లో కేసు వేశాడు. ఇప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ఆ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమా మొత్తం సీన్ టు సీన్ కాపీ అని, ఆ సినిమాలో ఏదైనా డిఫరెన్స్ ఉంది అనంటే దేవరకొండ అనే ప్లేస్ కి బదులు దేవరకోట అనే పేరును సినిమాలో ఉంచడం తప్ప మిగతా సీనులన్నీ కాపీ అంటూ చెప్పుకొచ్చాడు శరత్ చంద్ర. అయితే ఈ సినిమా కాపీ విషయంలో తనకు దాదాపుగా 15 లక్షల వరకు ఇస్తారన్న కానీ తనకు ఓనర్ షిప్ కావాలని లేకుంటే కొరటాల శివ జైలుకి వెళ్ళడం తప్పదని శరత్ చంద్ర డిమాండ్ చేశాడు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా విషయంలో కూడా కొరటాల శివ విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఆ సినిమా ఫలితం సక్సెస్ కాలేదు కాబట్టి ఆ వివాదం పెద్దగా తెరపైకి రాలేదు. ప్రస్తుతం దేవర అనే సినిమాను చేస్తున్నాడు కొరటాల శివ. ఇకపోతే ఈ విషయంపై ఇంకా కొరటాల శివ స్పందించలేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు