February Box Office : ఫిబ్రవరి సినిమాలన్నీ వాయిదాలే? ఎన్ని మూవీస్ అంటే?

2024 మొదలైనప్పటి నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా రిలీజ్ డేట్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సినిమాల మధ్య ఏర్పడే క్లాష్ వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో ఫిలిం ఛాంబర్ మూవీ రిలీజ్ డేట్ల విషయంలో జోక్యం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన సినిమాలు వరుసగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. దాదాపు అరడజను పైగా సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ల నుంచి కొత్త తేదీలకు తమ సినిమాలను వాయిదా వేసుకున్నాయి. మరి ఇప్పటిదాకా అలా పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలు ఏంటి అంటే…

ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న చాలా సినిమాల దృష్టి అంతా ఫిబ్రవరి 9 మీదే ఉంది. కానీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న మాస్ మహారాజా రవితేజ “ఈగల్” మూవీకే ఈ డేట్ ను ఇచ్చేసింది ఫిలిం చాంబర్. ఈగల్ కారణంగా అదే తేదీను రిలీజ్ డేట్ గా ముందుగానే ప్రకటించిన సినిమాలన్నీ పక్కకు తప్పుకోక తప్పలేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన క్రేజీ సీక్వెల్ “టిల్లు స్క్వేర్”ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీనీ ఇతర సినిమాలు కూడా టార్గెట్ చేయడంతో చేసేదేం లేక మార్చి 29కి ఈ మూవీని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన “ఊరు పేరు భైరవకోన” మూవీ కూడా ఫిబ్రవరి 9నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సందీప్ కిషన్ “ఈగల్” మూవీ కోసం తమ రిలీజ్ డేట్ ను త్యాగం చేసుకోక తప్పలేదు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో “ఊరు పేరు భైరవకోన” ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. కానీ “ఈగల్” కారణంగా అది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఫిబ్రవరి 16కు ఈ మూవీని వాయిదా వేసుకున్నారు.

ఇక వరుణ్ తేజ్, గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకోక తప్పలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. వీళ్ళ కన్ను కూడా ఫిబ్రవరి 9పైనే ఉండేది. కానీ అదే రోజున ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉండడంతో తమ సినిమాను వాయిదా వేసుకున్నారు. కాస్త ముందు చూపుతో ఒక వారం ఆలస్యంగా రావాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 16ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు “ఆపరేషన్ వాలెంటైన్” మూవీని ఫిబ్రవరి 23న లేదా మార్చి 1న రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ హీరోగా నటించిన “భీమా” మూవీ ఫిబ్రవరి 16 నుండి మార్చి 8కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇలా చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు సినీ విశ్లేషకులు. రానున్న రోజుల్లో సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఈ శఫ్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు