Gangs of Godavari : నితిన్, శర్వా రిజెక్ట్ చేసిన స్టోరీ… ఇన్ని కారణాలు ఉన్నాయా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ చేస్తున్న తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఈ మూవీని ఎట్టకేలకు మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”ని యంగ్ హీరోలు నితిన్, శర్వానంద్ ఇద్దరూ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంతకూ ఈ ఇద్దరు హీరోలు ఎందుకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీని రిజెక్ట్ చేశారు? అంటే….

ముందుగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ స్టోరీ ఎనర్జిటిక్ హీరో నితిన్ దగ్గరకు వెళ్లిందట. ఆయన ఈ సినిమాను వాళ్ళ ఓన్ బ్యానర్లో రెండు భాగాలుగా చేద్దామని భావించారట. దీంతో బడ్జెట్ పెరిగిపోయింది. కానీ ఏ మాత్రం ఫామ్ లో లేని నితిన్ వరుసగా డిజాస్టర్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఇలాంటి సమయంలో ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ ను పెట్టడం కరెక్ట్ కాదని భావించి, ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసాడట నితిన్. ఆ తర్వాత “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” స్టోరీ మరో యంగ్ హీరో శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట. అయితే రీసెంట్ గా పెళ్లయిన ఈ హీరో త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు “మనమే” సినిమాతో శర్వానంద్ బిజీగా ఉన్నాడు. దీంతో డేట్స్ ఖాళీ లేక శర్వా కూడా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”ని రిజెక్ట్ చేశారట. అలా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాత చివరగా విశ్వక్సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లో విశ్వక్సేన్ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”ని సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. బుధవారం రాత్రి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ ఐటమ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ పాటలో బిగ్ బాస్ సీజన్ 17 కంటెస్టెంట్ ఆయేషా ఖాన్ హీరో విశ్వక్సేన్ తో కలిసి చిందులేయబోతున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే… ముందుగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీని డిసెంబర్ 8న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ ఉండడం వంటి కారణాలతో వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ కు ఈగల్, ఊరు పేరు భైరవకోన, టిల్లు స్క్వేర్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు అడ్డు రావడంతో మార్చ్ 8ని “గ్యాంగ్ ఆఫ్ గోదావరి” రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు మేకర్స్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు