Sharwanand Upcoming Movie: ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న శర్వా?

Sharwanand Upcoming Movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సినిమా వచ్చి చాలా రోజులయింది. దాదాపు రెండేళ్ల కింద చేసిన ఒకే ఒక జీవితం మూవీ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ప్రస్తుతం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా సామజవరగమనా డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.

రామ్ అబ్బరాజు ఇంతకు ముందు తీసిన సామజవరగమనా తరహా లోనే ఈ సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉంటుందని టాక్. అయితే తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం అందింది. అందులో ఒకరు సంయుక్త మీనన్ కాగా, మరొకరు సాక్షి వైద్య అని టాక్. మూవీ టీమ్ నుండి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాకపోయినా వీళ్ళే కంఫర్మ్ అయినట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందింది.

అయితే సినిమా రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది. ఇక శర్వానంద్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడెప్పుడో రణదంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించగా, చాలా రోజులకు మళ్ళీ ఇద్దరు హీరోయిన్లు శర్వానంద్ సినిమాలో నటిస్తున్నారని చెప్పొచ్చు. ఇక మీడియం రేంజ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే శర్వానంద్ మాత్రం మెల్లిగా సినిమాలు చేస్తున్నాడు. పెళ్లి వల్ల ఈ గ్యాప్ వచ్చింది అనుకున్నా, ఆ గ్యాప్ ని ఒక స్ట్రాంగ్ హిట్ కొట్టి ఫిల్ చేస్తే మంచిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు