Telugu Singer: గీత మాధురి పేకాటలో అన్ని లక్షలు పోగొట్టుకుందా..?

సింగర్ గీతామాధురి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో తన హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరంటే టక్కున గుర్తుచేది ఈమె పేరే. గీతా మాధురి ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కలుపుకొని దాదాపు 1600 పాటలు పాడింది. ఇక గీతా మాధురి నటుడు నందూని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరికి దాక్షాయని ప్రకృతి అనే పాప కూడా ఉంది. అయితే ఆ మధ్య గీతామాధురి తన భర్త నటుడు నందుతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ వార్త చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ రూమర్ పై నందు ఓ వెబ్ సిరీస్ ఇంటర్వ్యూలో భాగంగా క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా గీతా మాధురి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. గీతా మాధురికి పేకాట ఆడే అలవాటు ఉందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇది నాటు పేకాట కాదు.. స్టైల్ పేకాట. అదేనండి క్యాసినో. తనకి జూదం ఆడడం అంటే ఎంతో ఇష్టమని.. క్యాసినో ఆడడంలో మునిగిపోతే ఏదీ పట్టించుకోనని తెలిపింది.

Geethe Madhuri: సింగర్ గీతామాధురి నందుకి విడాకులు ఇచ్చి ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుందా..?

- Advertisement -

అందులో బ్లాక్ జాక్ అనే ఆట అంటే మరింత పడి చచ్చిపోతోందట. ఈ ఆటను పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకుందట. కానీ ఈ ఆట ఎలా ఉంటుందో తన తల్లిదండ్రులకు చూపించి మళ్లీ దాని వైపు వెళ్లకూడదని ప్రామిస్ చేసుకుందట గీతా మాధురి. అంతేకాదు ఈ ఆటలో ఏకంగా మూడు లక్షలకు పైగానే పోగొట్టుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో గీతామాధురి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు