Kollywood: నాకు సమంతే కావాలంటున్న తమిళ స్టార్ హీరో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమ పెళ్లి, విడాకుల తరువాత ఫుల్ జోష్ లో సినిమాలు చేసింది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేసింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లతో దుమ్మురేపింది.

ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె మయోసైటీస్ అనే వ్యాధికి గురైంది. ఆ వ్యాధి నుండి బయటపడేందుకు సమంత ఎంతగానో పోరాటం చేసింది. ఈ పోరాటంలో ఆమె చాలావరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడ్డాక చాలా కాలం సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. తాజాగా నేను మళ్ళీ రెడీ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సమంత. అయితే ఈ ముద్దుగుమ్మ తో కలిసి సినిమా చేసేందుకు చాలామంది హీరోలు ఎదురు చూస్తుంటారు అన్న విషయం తెలిసిందే.

Samantha News: తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరో చెప్పేసిన సామ్!

- Advertisement -

వీరిలో తమిళ స్టార్ హీరో కార్తీ కూడా ఒకరు. ఈయన సమంతతో ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి హీరో కార్తీ గత మూడేళ్ల నుంచి తన సినిమాలో సమంతని హీరోయిన్ గా పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారట. అయితే అంతకుముందు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండడం, ఆ తరువాత మయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలకు దూరంగా ఉండడంతో కార్తీ కోరిక నెరవేరలేదు. మరి ఇకముందు అయినా కార్తీ కోరిక సమంత తీరుస్తుందో లేదో అనేది వేచి చూడాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు