MegaFans: ఆ హీరోయిన్ అందుకే వరుణ్ తేజ్ పెళ్లికి రాలేదా..? అభిమానులకి కొత్త డౌట్లు..!!

సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు కామన్. సినిమాలో నటిస్తున్న సమయంలో ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవడం, లేదంటే కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి విడిపోవడం వంటివి మనం వింటూనే ఉన్నాం. అయితే కొంతమంది అలా పెళ్లి చేసుకున్న ఆ తర్వాత మనస్పర్దాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టుస్కానీ లోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

గత 8 సంవత్సరాలుగా లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రేమ వివాహం ఇంట్లో చెప్పడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితులు కూడా హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకలో నితిన్ ఫ్యామిలీ కూడా పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో తనకు చాలా సన్నిహితంగా ఉన్న కొంతమందిని వరుణ్ తేజ్ పర్సనల్ గా ఇన్వైట్ చేశారట.

Lavanya Tripati Decision: మెగా కోడలు చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!

- Advertisement -

ఇలా ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ ఇన్వైట్ చేసిన వారిలో ఓ హీరోయిన్ కూడా ఉందని.. ఆమెని పర్సనల్ గా ఇన్వైట్ చేసినప్పటికీ ఆమె మాత్రం పెళ్లికి రాలేదట. దీంతో ఈ వ్యవహారం పై అభిమానులు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు రాశిఖన్నా. వరుణ్ – రాశిఖన్నాతో కలిసి పలు సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. అయితే వరుణ్ మాత్రం రాశిఖన్నాని ఓ స్నేహితురాలిగా చూడగా.. రాశిఖన్నా మాత్రం వరుణ్ నీ లవర్ గా ఊహించుకుందట. ఇలా ఆమె ఇష్టపడిన వరుణ్ తనకి కాకుండా వేరే వాళ్లకు దక్కుతున్నాడు అన్న భాదతోనే ఆమె పెళ్లికి వెళ్లలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. శుభమా అంటూ వారు ఇప్పుడే పెళ్లి చేసుకున్న సమయంలో ఇలాంటి వార్తలను సృష్టించడం భావ్యం కాదని మండిపడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు