Ram Charan: వైజాగ్ బీచ్ లో క్లీంకారా.. ఎంత క్యూట్ గా వుందో..!

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకపక్క నటుడుగా కెరీయర్ని కొనసాగిస్తూనే మరొకపక్క తండ్రిగా, మంచి భర్తగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. సినిమా షూటింగ్లలో సమయం దొరికితే చాలు భార్య బిడ్డతో సమయాన్ని గడపడానికి తెగ ఆసక్తి చూపించే రామ్ చరణ్.. తాజాగాతన కుటుంబంతో కలిసి వైజాగ్ బీచ్ లో చేసిన రచ్చ అభిమానులను మరింత సంతోషానికి గురిచేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ కొన్ని గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్లో భాగంగా మన వైజాగ్ కి చేరుకున్న విషయం తెలిసింది.. సినిమా షూటింగ్లో భాగంగానే వైజాగ్ బీచ్ లో పెద్ద సెట్ కూడా ఏర్పాటు చేశారు.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన హీరోని చూడడానికి వస్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే కాస్త సమయం దొరికితే చాలు అటు అభిమానులకు కొంత సమయాన్ని కేటాయిస్తూనే మరొకపక్క తన భార్య ఉపాసన , కూతురు క్లీంకారాతో సమయాన్ని గడుపుతున్నారు రామ్ చరణ్.. తాజాగా వారితో కలిసి వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది.

భార్యాబిడ్డతో బీచ్ లో రామ్ చరణ్..
నిన్నటితో అక్కడ షూటింగ్ కూడా పూర్తి అయింది ..మళ్ళీ 21వ తారీకు నుంచి హైదరాబాదులో సరికొత్త షెడ్యూల్ తో మొదలు పెట్టబోతున్నారు.. అందుకే కాస్త సమయం దొరకడంతో కుటుంబంతో చిల్ అయ్యారు ఈ జంట. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది.. ఈ వీడియో లో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లింకారా తో వైజాగ్ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఒక వీడియోని ఉపాసన షేర్ చేసింది.. ఉదయం సన్రైజ్ ను చూస్తూ క్లింకారా తో పాటు రామ్ చరణ్ కూడా ఆడుకుంటున్న ఈ వీడియో మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

బుచ్చిబాబుతో సినిమా పూజా కార్యక్రమాలు.
ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. ఈ రోజున డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న తదుపరి చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో.. సుకుమార్ రైటింగ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని కూడా పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ టైటిల్ పైన ఈ రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.. హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతోందంటూ.. ఆమె పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RRR చిత్రంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అభిమానులు మాత్రం డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల చేత ఈ సినిమా లేట్ అవుతూనే ఉండడంతో నిరుత్సాహ పడుతున్నారు. ఇక త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు