Poonam Kaur: పవన్ కళ్యాణ్ ను ఇగ్నోర్ చేసిందా.. ఆ మాటలకు అర్థం..!

హీరోయిన్ పూనమ్ కౌర్.. ఎప్పుడూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాటల మాంత్రికుడు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సపోర్టివ్గా ట్వీట్ వేస్తుందా.. విమర్శిస్తుందా అనే విషయం తెలియక అభిమానులు గందరగోళంలో పడుతున్నారు.. అయితే త్రివిక్రమ్ మీద మాత్రం ఈ మధ్య డైరెక్ట్ గానే కొన్ని కౌంటర్లు వేస్తోంది పూనమ్ కౌర్.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ మీద కూడా స్పందించింది.. సాధారణంగా ఈ టీజర్ ని ఎవరు చూసినా కూడా పవన్ కళ్యాణ్ బాగా చేశారని.. బాగా చేయలేదని తెలియజేస్తూ ఉంటారు అభిమానులు.

దేవిశ్రీప్రసాద్ ని పొగిడేసిన పూనమ్..
యాంటీ ఫ్యాన్స్ మాత్రం కొంతమంది బాగాలేదని చెబుతూ ఉంటారు.. కానీ పూనమ్ కౌర్ మాత్రం.. పవన్ కళ్యాణ్ ను ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తున్నది.. అసలు పవన్ కళ్యాణ్ అనే వాడు ఈ టీజర్ లో ఉన్నారా అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు అన్నట్లుగా కనిపిస్తోంది.. ఈ టీజర్ మీద స్పందిస్తూ కేవలం దేవి శ్రీ ప్రసాద్ గురించి ఆమె మాట్లాడుతూ పొగిడేయడం పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది… కమర్షియల్ చిత్రాలు అంటే నువ్వు కచ్చితంగా ఉండాల్సిందే.. నువ్వు లేకపోతే ఆ సినిమాలు అసంపూర్ణమంటూ దేవిశ్రీప్రసాద్ ని పొగిడేసింది.

పవన్ కళ్యాణ్ ను ఇగ్నోర్ చేసిన పూనమ్…
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈమె పైన పరోక్షంగా కామెంట్లతో మండిపడుతున్నారు. మరి కొంతమంది చాలా దారుణంగానే ఈమెను విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి అంటూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. అసలు ఈ టీజర్ చూసి పూనమ్ కౌర్ ఎందుకు ఇలా స్పందించింది.. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ను ఇగ్నోర్ చేస్తూ ఇలా ఎందుకు కించపరుస్తోందనే విషయం మాత్రం అభిమానులను కాస్త కన్ఫ్యూజన్లో పడేసిందని చెప్పవచ్చు..

- Advertisement -

నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఎంతో పవర్ఫుల్ గా గ్లింప్స్ డైలాగ్ లతో పాటూ టీజర్ ను డైరక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.. ఈ టీజర్ మాస్ కమర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా ఉన్నది.. అయితే ఎక్కువగా జనసేన పార్టీని ప్రమోట్ చేసేలా కనిపిస్తూ ఉండడంతో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తుండగా మరి కొంతమందికి మాత్రం ఈ టీజర్ పిచ్చపిచ్చగా నచ్చేసింది అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టేసి దేవిశ్రీప్రసాద్ ను పొగిడేసిన పూనంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ కౌంటర్లకు పూనమ్ కౌర్ ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి మరి.

పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమా షూటింగులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు