Pushpa 2 Leak: తప్పని లీకులు బెడదా… శ్రీవల్లి లుక్ మరోసారి లీక్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా గురించి తెలిసిందే. బాహుబలి ట్రిపుల్ సినిమాలు తర్వాత తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఒకటి అని చెప్పొచ్చు. పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తగ్గేదేలే అనే డైలాగ్ లా ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా సంచలనాలను క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది.

ఇండస్ట్రీలో చాలా కాంబినేషన్స్ కి ఒక క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, మహేష్ బాబు త్రివిక్రమ్, బోయపాటి శీను బాలకృష్ణ, గోపీచంద్ మలినేని రవితేజ, పూరి జగన్నాథ్ రవితేజ ఇలా కొన్ని కాంబినేషన్స్ కి ఎంతటి ఆదరణ లభిస్తుందో అలానే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అన్న కూడా అంతటి ఆదరణ లభిస్తుంది అని చెప్పొచ్చు.

ఎందుకంటే అల్లు అర్జున్ కి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చి అద్భుతమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసిన సినిమా అంటే ఆర్య అని అందరూ చెబుతారు. ఆర్య సినిమాని అల్లు అర్జున్ చేయడమే తన కెరీర్ కి పెద్ద ప్లస్. అల్లు అర్జున్ సుకుమార్ పరిచయం అప్పటినుంచి మొదలై అది ఒక స్నేహంగా మారింది. అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో నేను ఈ స్థాయి వరకు రావడానికి నా వెనక ఎవరు కారణమని చూసుకుంటే నాకు సుకుమార్ కనిపిస్తాడు అంటూ పబ్లిక్ గానే చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఊహించిన స్థాయి కంటే ఎక్కువ హిట్ అయింది. అందువలన ఈ సినిమా పైన ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో మేనరిజమ్స్ ఎంత హిట్ అయ్యాయో ఈ సినిమాలో పాటలు కూడా అంతే హిట్ అయ్యాయి.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించిన. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. ఇక పుష్ప సినిమా తర్వాత రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా అనిమల్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంది రష్మిక.

పుష్ప సినిమా మొదటి పార్ట్ లో శ్రీవల్లిని పుష్పరాజ్ పెళ్లి చేసుకున్నట్లు చూపించాడు సుకుమార్. అయితే ఇక ఈ సినిమాలో కూడా రష్మిక క్యారెక్టర్ ఉండబోతుంది. అయితే ఇప్పుడు రష్మిక సంబంధించిన ఒక ఫోటో లీక్ అయింది. ఈ లీకైన ఫోటోలో రష్మిక ఎరుపు రంగు చీరను కట్టుకొని, బంగారం ఆభరణాలు ధరించి చాలా అందంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Rashmika Mandanna's look from Pushpa 2 leaked

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు