Prithviraj Sukumaran: రెండుసార్లు మెగాస్టార్ నుంచి తప్పించుకున్నాడు

సినిమా కోసం కొంతమంది దర్శకులు కొంత టైం ని కేటాయిస్తారు. ఇంకొంతమంది దర్శకులు ఒక కథను చెప్పడానికి సంవత్సరాలు పాటు ప్రయాణం చేస్తారు. తెలుగులో ఒక సినిమాను తెరకెక్కించడానికి ఎక్కువ టైం తీసుకునే దర్శకులు అంటే ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. సినిమా తీయడానికి రాజమౌళి ఎక్కువ టైం తీసుకున్న కూడా ఆ సినిమా చివరిగా ఆడియన్స్ కి సంతృప్తిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇకపోతే తెలుగులో రీసెంట్ టైమ్స్ లో గత ఆరేళ్లుగా నిర్మితమై మార్చి 8న రిలీజ్ అయిన సినిమా గామి. ఈ సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇకపోతే మలయాళం లో ఒక సినిమా దాదాపు 10 ఏళ్ల పాటు నిర్మితమై వస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ఈ చిత్రం ‘ఆడుజీవితం’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా జరిగే ప్రాసెస్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కి చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా కోసం వాటిని కూడా వదులుకున్నాడు పృథ్వీరాజ్. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ నటించారు. అమితాబచ్చన్ విజయ్ సేతుపతి వంటి నటులు కూడా ఈ సినిమాలో చేశారు.

- Advertisement -

అయితే ఈ సినిమా కోసం మలయాళం యాక్టర్ పృధ్వీరాజ్ సుకుమారన్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి సంప్రదించారట. అయితే దానికి పృధ్వీరాజ్ సర్ ప్రస్తుతం నేను ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పుడు నాకున్న టైం లో మీతో కలిసి పని చేయలేను కానీ మీతో పని చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత దాదాపు 5 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకి దర్శకత్వం చేయమని పృథ్వీరాజ్ ను అడిగారట. అప్పుడు కూడా పృథ్వీరాజ్ సర్ నేను ఒక సినిమాను చేస్తున్నాను ఆ సినిమా పూర్తి చేయాలి అంటూ మళ్ళీ చెప్పుకొచ్చారట. అయితే ఐదేళ్ల క్రితం నటుడుగా అడిగినప్పుడు, ఐదేళ్ల తర్వాత దర్శకుడుగా అడిగినప్పుడు కూడా ఒకే ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాను అని చెప్పడం చూసి మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయాడట.

ఇకపోతే దాదాపు పదివేల నుంచి ఈ ఆడు జీవితం సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు.బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మార్చి 28న మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు