Holi Special Songs : తెలుగు సినిమాల్లో హోలీ కేళి..

భారతదేశంలో కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. దేశంమొత్తంలో ఈ పండుగరోజు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఈరోజు ఏడు రంగులను ఒకరిపై ఒకరు పూసుకుని, రంగునీళ్లు చల్లుకుంటూ తడిసి ముద్దయిపోతారు. సమ్మర్ స్టార్టింగ్ లో అంటే చలికాలం పోయి వేసవి వచ్చే సమయంలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోళి.ఈనాడు భౌతికమైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను విజ్ఞానమనే మంటల్లో, హోళికా దహనంలో తగలబెట్టి మంచి జీవితం గడపాలని అందరూ కోలుకునేదే హోలీ పండగ ముఖ్య ఉద్దేశ్యం. ఇక తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగ అనేది చాలా స్పెషల్. పండుగలతో పాటు సినిమాలని కూడా పండగలా భావించే తెలుగు ప్రేక్షకులు తెలుగు చిత్రాల్లో వచ్చిన ఈ ప్రత్యేకమైన పాటలని ఆస్వాదిస్తూ హోలీ జరుపుకుంటారు. అలా తెలుగు చిత్ర సీమలో రంగులమయమమైన ఆ హోళీ పాటలలో కొన్నింటిపై ఓ లుక్కేద్దాం.

1. మాస్ : కొట్టు రంగు దీసి కొట్టు..

దేశంలో హోలి ఏడాదిలో ఒక్కసారి వచ్చే పండుగ. ఈ సీన్ తెరపై కనిపిస్తే, తెలుగు ప్రేక్షకులు పులకించిపోయి డాన్స్ చేసేస్తారు. అప్పట్లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమాలో నాగార్జున హీరోయిన్ తో కలిసి డాన్స్ చేసే హోలీ సాంగ్ ఓ రేంజ్ కిక్ ఇస్తుంది. సాహితి రాసిన కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ఆ సినిమాలో కాలనీ లో హోలీ సెలబ్రేట్ చేశాడు.

- Advertisement -

2. సీతారామరాజు : రంగేళి హోలీ

అయితే మాస్ కంటే ముందు నాగార్జున తాను నటించిన సీతారామ రాజు సినిమాలోనే హోలీ సాంగ్ చేసాడు. ఆ సినిమాలో హోలీ రంగేళి అంటూ హీరోయిన్ తో కలిసి రంగులు పూసుకున్నాడు. అలాగే ఆ పాటలో నందమూరి హరికృష్ణతో కలిసి ఈ సినిమాలో కూడా హోలీ సంబరాలు చేసుకున్నారు.

3. రాఖి : రంగు రబ్బా రబ్బా

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో ‘రంగు రబ్బా రబ్బా’ అంటుంది రంగు’ అంటూ ఎన్టీఆర్ ఇలియానా మధ్య సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ ఇప్పటికి ఓ రేంజ్ ఫేమస్. చూసేందుకు కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది ఈ పాట.

4. చక్రం : రంగేళి హోలీ

ఇక కృష్ణవంశీ దర్శకత్వంలోనే వచ్చిన చక్రం సినిమాలో రంగేళి పాట సూపర్ గా ఉంటుంది. ఆ సినిమాలో హోలీ సీన్ కు మంచి మ్యూజిక్ తోడైతే.. చక్రం సినిమాలో సిరివెన్నెల రాసిన రంగేలీ హోలీ పాట సూపర్ గా ఉంటుంది. ప్రభాస్, చార్మీలు ఈ పాటలో రంగుల వర్షంలో తడుస్తారు.

5. శ్రీ : ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాలోనూ హోలీ హోలీ పండగల్లే ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది నాలో అని రంగులు చల్లుకున్నాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తమన్నాతో కలిసి రంగులు చల్లుకున్నాడు.

6. నాయకుడు : సందెపొద్దు

ఇక ఇప్పట్లో మాత్రమే కాదు. 80స్ లో కూడా హోలీ రంగుల్లో మునిగితేలారు హీరోలు. 1987లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమాలో కమల్ హాసన్ రంగులు సందెపొద్దు అంటూ హీరోయిన్తో ఫ్యామిలీ తో పాటలు పాడారు.

7. పదహారేళ్ళ వయసు : వయస్సంత ముడుపుకట్టి

కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పదరేళ్ల వయసు సినిమాలో వయస్సంత ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకుందాం.. సినిమాలో హోలీ సంబరాల్ని ప్రత్యేకంగా చూపించారు.

8. జెమినీ : దిల్ దివానా

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘జెమిని’ సినిమాలోని ‘దిల్ దీవానా’ పాట కూడా హోలీ నేపథ్యంలో తెరకెక్కింది. హీరోయిన్ నమిత ఈ పాటలో ఫ్యామిలి తో కలిసి సెలెబ్రేట్ చేస్తుంటే చూసేందుకు చాలా బాగుంటుంది.

ఇక పాటల్లోనే కాదు, మామూలుగా తెరపై పలువురు హీరోలు సినిమాల్లో రంగులు జల్లు కున్నారు. అనేక సినిమాల్లో హోలీ సన్నివేశాలు తెలుగు తెర మీద రంగులను పులిమాయి. ఇంద్ర, ఓయ్, హోలీ లాంటి సినిమాల్లో హోలీ సీన్స్ తో హీరోలు రంగులు పూసుకున్నారు. అయితే హోలీ ప్రకృతి పండగ. ప్రకృతిలో దొరికే సహాజసిద్దమైన పూలతో తయారు చేసిన రంగులు పూసుకోవడం ఈ పండగ ప్రత్యేకత. ముఖ్యంగా మోదుగుపూలతో రంగును తయారు చేసి జల్లుకుంటారు. అది ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. కానీ ఈ రోజుల్లో హోలీ అలా జరుపుకోవడం లేదు. మార్కెట్ లో దొరికే కెమికల్స్ తో తయారైన రంగులు ఎక్కువగా వాడుతున్నారు. అసలు హోలీ లో ఎలాంటి రసాయనాలు లేకుండా వాడితే, పొల్యుషన్ కూడా పాడవ్వకుండా ఉంటుంది. అందుకోసం.. ప్రతి ఒక్కరూ రసాయన రంగులకు బదులుగా పూలతో తయారు చేసిన రంగుల్ని, అలాగే పసుపు కుంకుమలతో చేసిన రంగునీళ్లతో హోలీని జరుపుకుంటూ తమ జీవితాల్లో రంగులను నింపాలని కోరుకుందాం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు