Kangana Ranaut : ఎన్నికల బరిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..

దేశంలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ లో ఇప్పటికే ఎమ్మెల్యే ఎలెక్షన్లు జరగగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ ఎమ్మెల్యే తో పాటు ఎంపీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడి టాలీవుడ్ కి కూడా బాగానే అంటుకుంది. ఇక సౌత్ లో సినిమాల నుండి వచ్చిన వారు రాజకీయాల్లో కూడా ముందు నుండి రాణిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తమిళనాడులో అయితే సినిమా ఆర్టిస్టులు పెట్టిన పార్టీలే ఎన్నో ఏళ్లుగా రాజ్యేమేలుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో పలువురు సినీ ప్రముఖులు రాజీకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలవనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రముఖ నటి అనుష్క శెట్టిని ఎన్నికల్లో ఎమ్మెల్యే గా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తుందని సమాచారం. కొన్ని రోజుల నుండి జోరుగా ఈ ప్రచారం సాగుతుంది. ఇక నార్త్ వైపు టాలీవుడ్ లో చిరుత సినిమాలో నటించిన హీరోయిన్ నేహా శర్మ కూడా ఎంపీ గా ఈ లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లోని భగల్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ ప్రస్తుతం భగల్పూర్ ఎమ్మెల్యే. కూతురికి ఎంపీ సీట్ కోసం ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసినీ వర్గాల సమాచారం.

ఇక తాజాగా ఈ ఎలక్షన్ల బరిలో మరో హీరోయిన్ కూడా నిలవనుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్ లో మండి ఊరు నుండి ఎంపీ గా ఎన్నికల్లో పోటీ చేస్తుందట. ఇక కంగనా రనౌత్ ముందు నుండి రాజకీయాల్లో లేకపోయినా, రాజకీయనాయకులకు టచ్ లోనే ఉంటుంది. పలు సేవా కార్యక్రమాల్లో కూడా కొన్నేళ్లుగా పాల్గొంటూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ, రోజా వంటి వారు ముందు నుండి సినిమాల్లో నటిస్తోనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. అలనాటి నటీమణులు జయసుధ, జయప్రద, సుమలత వంటి వారు కూడా రాజకీయాల్లో నిలిచి గెలిచినవారే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు