Neha Sharma: సినిమాలు వర్కౌట్ కాలేదు పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధం

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ ఇదే సినిమాతో హీరోగా తెలుగు పరిచయం అయ్యాడు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ని పూరి జగన్నాథ్ పరిచయం చేశాడు. చాలామంది చాలా సినిమాలు చేసి తమకు తాము మంచి పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఇకపోతే చిరుత సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ కి పర్ఫెక్ట్ ఎంట్రీ ఫిల్మ్ అనిపించుకుంది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ చాలామంది మెగా అభిమానులకు ట్రీట్ లా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో నేహా శర్మ పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాలో కనిపించింది నేహా.

ఇక మొదటి సినిమా సూపర్ హిట్ అయినా కూడా నేహా శర్మకు సరైన అవకాశాలు లభించలేదు. ఇకపోతే నేహా శర్మ పర్సనల్ విషయాలకు వస్తే 1987, నవంబరు 21 న బీహార్ లోని భాగల్పూర్లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. భగల్పుర్ అసంబ్లీ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఎ గా ఎన్నిక అయ్యాడు. ఇకపోతే నేహ శర్మకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది అని చాలామందికి తెలియదు.

- Advertisement -

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటుంటారు. అందరూ కూడా సక్సెస్ అవుతారు అని చెప్పలేము. మొదటి సినిమా హిట్ అయిన కూడా చాలామందికి అవకాశాలు లభించవు. మొదటి సినిమా డిజాస్టర్ అయిన కూడా కొంతమంది స్టార్ హీరోయిన్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడిపోతారు. రీసెంట్ టైమ్స్ లో అలా స్థిరపడిపోయిన హీరోయిన్ అంటే శ్రీ లీలా అని చెప్పొచ్చు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. కానీ శ్రీ లీలా మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నేహా శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనన్నట్లు తెలుస్తోంది.ఈ లోక్ సభ ఎన్నికల్లో నేహా శర్మ బీహార్ లోని భగల్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ ప్రస్తుతం భగల్పూర్ ఎమ్మెల్యే. కూతురికి ఎంపీ సీట్ కోసం ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసినీ వర్గాల సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు