11YearsForSwamyRaRa : పర్ఫెక్ట్ సీక్వెల్ కి స్కోప్ ఉన్న సినిమా

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఎన్నో సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలు మాత్రమే ఒక స్టాండర్డ్ ను సెట్ చేస్తాయని చెప్పొచ్చు. 2013లో రిలీజ్ అయిన స్వామిరారా సినిమా అలాంటి ఒక స్టాండర్డ్ ను సెట్ చేసింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

స్వామి రారా సినిమా మొదలయ్యే ముందు సుధీర్ వర్మ ఒక టైటిల్ కార్డును వేస్తాడు. నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను అంటూ ప్రముఖ దర్శకులు పేర్లతో పాటు తన పేరును కూడా వేస్తాడు సుధీర్ వర్మ. అక్కడితో సుధీర్ వర్మ ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నాడు అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. అయితే స్వామి రారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా, సినిమా మేకింగ్ పరంగా చాలామందిని సప్రైజ్ చేసిందని చెప్పొచ్చు.

ఇక స్వామి రారా సినిమా కథ విషయానికి వస్తే…

- Advertisement -

ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో స్టార్ట్ అవుతుంది. ఈ విగ్రహం అత్యంత పురాతనమైనది కావడం వలన మార్కెట్ లో భారీగా ధర పలుకుతుంది. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.

ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పనిచేస్తున్న స్వాతి (స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి స్నేహితులుగా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం దుర్గకి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిబాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అనేది మిగతా కథ.

ఈ సినిమా తర్వాత నిఖిల్ కి మంచి ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు. అలానే దర్శకుడు సుధీర్ వర్మకి కూడా మంచి పేరు లభించింది. అలానే మంచి అవకాశాలు కూడా వచ్చాయి. స్వామి రారా సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా ఇప్పటివరకు సుధీర్ వర్మ తీయలేదు. సుధీర్ వర్మ తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కొద్దిపాటి నిరాశనే మిగిల్చాయి. ఇకపోతే స్వామి రారా లాంటి కల్ట్ సినిమాని ఇచ్చినందుకు సుధీర్ వర్మ పైన చాలామంది సినిమా ప్రేమికులకు ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ ఉంది. ఇకపోతే నేటితో ఈ సినిమా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ సీక్వెల్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా సీక్వెల్ కోసం చాలామంది సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు