Tollywood : ఈ హీరోలను పట్టుకుంటే మూడు రోజుల్లోనే లాభాలు

Tollywood : కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం బ్రో… అంటున్నారు టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరోలు శ్రీవిష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్. చెప్పడమే కాదు కంటెంట్ నే నమ్ముకుని, సినిమాలు చేసి హిట్టు కొట్టి చూపిస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూనే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోలను నమ్ముకుంటే లాభాల పంట పండడం ఖాయమని అనిపించేలా చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే సినిమా లాభాల్లోకి అడుగుపెట్టే విధంగా అదిరిపోయే కంటెంట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ఇద్దరు హీరోలు. తాజాగా శ్రీవిష్ణు “ఓం భీమ్ బుష్”, రీసెంట్ గా విశ్వక్ సేన్ “గామి” సినిమాలతో రెండు మూడు రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేలా చేసుకున్నారు.

“ఓం భీమ్ బుష్”కు రెండు రోజుల్లోనే లాభాలు…

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. ఈ మూవీ గత శుక్రవారం అంటే మార్చ్ 22న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే మిక్స్డ్ రివ్యూలను మూటగట్టుకున్న ఈ మూవీనీ థియేటర్లలో ప్రేక్షకులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగు పెట్టేసింది ఈ మూవీ. రోజు రోజుకు ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ పెరుగుతుండడం గమనార్హం. మొదటి రోజు 4.6 కోట్లు, రెండో రోజు 5.8 కోట్లు, మూడో రోజు 6.56 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. 10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 21.75 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. ఇక శ్రీవిష్ణు గత చిత్రం సామజవరగమన కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

“గామి” మరో ఉదాహరణ…

మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి మూవీ కూడా మూడు రోజుల్లోనే బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20.3 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. రెండవ రోజే లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ మూవీ కేవలం 3 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కినట్టు సమాచారం. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ కూడా “టిల్లు స్క్వేర్” మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీకి అంచనాలకు తగ్గట్టుగా అదిరిపోయేలా లేకపోయినా, కనీసం యావరేజ్ టాక్ వస్తే చాలు నిర్మాతలు లాభాలు అందుకోవడం మాత్రం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి ఈ ముగ్గురు యంగ్ హీరోలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో కంటెంట్ బేస్డ్ సినిమాలతో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంటున్నారు. అంతేకాకుండా భారీ బడ్జెట్ పెట్టి నిర్మాతలు నిండా మునగకుండా కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోలే మోస్ట్ వాంటెడ్ అని చెప్పొచ్చు. వందల కోట్ల డబ్బును నీళ్లలో వీళ్ళపై ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అతి తక్కువ బడ్జెట్ తో లాభాలను జేబులోకి వేసుకోవాలంటే నిర్మాతలు చేయాల్సిందల్లా ఈ యంగ్ హీరోలను కావలసినట్టుగా వాడుకోవడమే. సరైన కంటెంట్ పట్టుకొని వీళ్ళ మీద బడ్జెట్ పెడితే వారంలోపే ప్రొడ్యూసర్స్ లాభాలు చూడడం మాత్రం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు