Om Bheem Bush Collections : చిన్న సినిమా… పెద్ద సంఖ్యలో ఫేక్ కలెక్షన్లు

Om Bheem Bush Collections : ఇటీవల కాలంలో ఫేక్ కలెక్షన్స్ మాట సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తోంది. సినిమా హిట్ అంటూ ఫేక్ కలెక్షన్స్ చూపిస్తూ సినిమా హిట్ కాలేదన్న విషయాన్ని దాచేసి మసిపూసి మారేడు కాయ అనే సామెతను నిజం చేస్తున్నారు కొంతమంది మేకర్స్. తాజాగా ఈ లిస్ట్ లో “ఓం భీమ్ బుష్” కూడా చేరినట్టుగా తెలుస్తోంది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కలెక్షన్స్ అన్నీ ఫేక్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ విమర్శలకి కారణం ఏంటి? “ఓం భీమ్ బుష్” ఒరిజినల్ కలెక్షన్స్ ( Om Bheem Bush Collections ) ఎంత? అనే వివరాల్లోకి వెళితే…

పోస్టర్‌లో ఫుల్… గల్లలో మాత్రం నిల్

శ్రీ విష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. మార్చి 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చాయి అంటూ మేకర్స్ డప్పు కొట్టుకుంటున్నారు. రిలీజ్ రోజు కంటే ఆ తర్వాత రోజు రోజుకు కలెక్షన్స్ పుంజుకుంటున్నాయని చెప్తున్నారు. ఈ మేరకు ప్రతిరోజు అఫీషియల్ గా ఓం భీమ్ బుష్ మూవీ ఇన్ని కోట్ల కలెక్షన్స్ సాధించింది అంటూ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. కానీ నిజానికి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. కామెడీ బాగున్నప్పటికీ మిక్స్డ్ టాక్ తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. పైగా శ్రీ విష్ణు గత చిత్రం సామజవరగమన రేంజ్ లో పికప్ లేదు. అయినప్పటికీ చిత్ర బృందం కలెక్షన్లను కోట్లలో చూపిస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే “ఓం భీమ్ బుష్” మూవీ 23.85 కోట్లు కొల్లగొట్టింది అంటూ తాజాగా మరో పోస్టర్ వేశారు మేకర్స్.

Om Bheem Bush Collections
Om Bheem Bush Collections

వాస్తవానికి ఇలా ఫేక్ కలెక్షన్స్ తో జనాలను థియేటర్లలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఫేక్ కలెక్షన్స్ క్రియేట్ చేస్తూ సినీ ప్రియులను అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ కలెక్షన్స్, లాభాలు అన్ని పోస్టర్లకు మాత్రమే పరిమితం అయ్యాయని, నిర్మాతల జేబులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ సినిమాకు ఇప్పటిదాకా కనీసం 5 కోట్ల షేర్ కూడా రాలేదని ఇన్సైడ్ టాక్. రీసెంట్ గా గుంటూరు కారం మూవీ విషయంలో కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. మూవీకి తీవ్రమైన నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిర్మాతలు వందల కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు పోస్టర్స్ వేయడంతో ఫేక్ కలెక్షన్స్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఓం భీమ్ బుష్ పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అనిపిస్తోంది.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కు ఇదే అడ్డంకి…

“ఓం భీమ్ బుష్” మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కావడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ శుక్రవారం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టిల్లు స్క్వేర్ రాబోతోంది. ఓం బీమ్ బుష్ మీద ఆ మూవీ ఎఫెక్ట్ గట్టిగానే పడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టిల్లు స్క్వేర్ మూవీకి యావరేజ్ టాక్ వస్తే కొంతవరకు “ఓం భీమ్ బుష్” మూవీ థియేటర్లలో ఆడే అవకాశం ఉంటుంది. అది కూడా ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేదాకా మాత్రమే. ఒకవేళ టిల్లు స్క్వేర్ గనక పాజిటివ్ టాక్ తో నడిస్తే “ఓం భీమ్ బుష్” పూర్తిగా వాష్ అవుట్ కావడం ఖాయం. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో “ఓం భీమ్ బుష్” పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో మేకర్స్ ఫేక్ కలెక్షన్స్ తో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. అయినప్పటికీ బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు. మొత్తానికి “ఓం భీమ్ బుష్” మూవీ ఆడియన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు