Om Bheem Bush : మరో జాతి రత్నాలు అవుతుందా.?

Om Bheem Bush : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమా అంటే ఒక మంచి కథ దానికి సరిపడా స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకొని ఉండేవాళ్లు దర్శకులు. కానీ రీసెంట్ టైమ్స్ లో సినిమా తీసే విధానం ప్రేక్షకులు సినిమా చూసే విధానం రెండు మారిపోయాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు కేవలం వినోదాన్ని మాత్రమే అందిస్తే చాలు అని చాలామంది దర్శకులు బలంగా నమ్ముతారు.

అలా బలంగా నమ్మిన దర్శకులు అంటే అనుదీప్ కే బి అని చెప్పొచ్చు. జాతి రత్నాలు అనే సినిమాకు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ను సాధించాడు. ఆ తర్వాత చాలామంది దర్శకులు కూడా అదే పంథాను కొనసాగించే ప్రయత్నం చేశారు. కొందరు దర్శకులు మాత్రం ఒక ఖచ్చితమైన కథను చెప్పాలని సంవత్సరాలు తరబడి టైం తీసుకుంటారు. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన సినిమా అంటే గామి అని చెప్పొచ్చు. దాదాపు 8 ఏళ్లుగా ఈ సినిమా పైన వర్క్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా రీసెంట్ గా మార్చి 8 రిలీజై ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూపించి అద్భుతమైన హిట్ అందుకున్న సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. రీసెంట్ గా అలానే వచ్చిన సినిమా ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుంది. అదే ఓం భీమ్ బుష్ (Om Bheem Bush).
ఈరోజుకి ఆ సినిమా 21 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ ను సాధించింది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ట్యాగ్ లైన్ లోనే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ రాసుకోచ్చారు.

- Advertisement -

Om Bheem Bush 4 days collections

తిరుపతి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది యంగ్ దర్శకులు వస్తూ ఉంటారు. అందులో హుషారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీహర్ష కొనుగంటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో సినిమాను సాధించాడు శ్రీహర్ష. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అనే సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇకపోతే యూవీ క్రియేషన్స్ లో ఓం భీమ్ బుష్ అనే సినిమాను తెరకెక్కించాడు హర్ష. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కి వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించారు. ఇదే కాంబినేషన్లో ఇంతకుముందు బ్రోచేవారెవరు అనే సినిమా కూడా చేశారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఇది ఈ సినిమాతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ను అందించాడు హర్ష.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధిస్తున్నాయి. జాతి రత్నాలు, మ్యాడ్,ఇప్పుడు ఓం భీమ్ బుష్ వంటి సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్నాయి. ఇక రాబోయే టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుంది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు