HBD Prakash raj : ప్రకాష్ రాజ్ గురించి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!!

HBD Prakash raj : సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలిగి నటించగలిగే నటులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు ప్రకాష్ రాజ్ కూడా ఒకరు.. ఎన్నో వందలాది చిత్రాలలో నటించి తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా ఎన్నికల విషయంలో కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ రోజున ప్రకాష్ రాజ్ ( HBD Prakash raj ) 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి మన చూద్దాం.

ప్రకాష్ రాజ్ సినీ ప్రయాణం..

సినీ ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా విభిన్నమైన పాత్రలలో అలరిస్తున్న ప్రకాష్ రాజ్ ఏడు ప్రధాన భారతీయ భాషలలో దాదాపుగా 400కు పైగా చిత్రాలలో నటించారు. నటుడుగానే కాకుండా టీవీ హోస్టుగా, డైరెక్టర్గా, నిర్మాతగా కూడా తనకంటూ ఒక మార్క్ ను సృష్టించుకున్నారు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలో జన్మించారు. ఈయన కూడా రంగస్థలం నటుడే.. మొదట ఎన్నో స్టేజి షోలను చేసిన తర్వాతే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో ఎంట్రీ ఇచ్చారు. కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా కన్నడ చిత్రాలలోనే నటించారట ప్రకాష్ రాజ్.

ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ ఎంట్రీ..

మొదట డైరెక్టర్ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సంకల్పం మూవీతో పరిచయం అయ్యారు. తన కెరియర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు ప్రకాష్ రాజ్.. తెలుగులో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలలో మొదట కనిపించిన సంకల్పం సినిమా ద్వారానే తన కెరీర్ నే మలుపు తిప్పుకునేలా చేసుకున్నారు ప్రకాష్ రాజ్.. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో విలన్ గా తండ్రిగా నటించి భారీ క్రేజ్ అందుకున్నారు.

- Advertisement -

ప్రకాష్ రాజ్ ఎలాంటి విషయాలలోనైనా సరే తనకు నచ్చని పని ఉంటే కచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన నటుడుగా పేరు పొందారు.ఈమధ్య రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు ప్రకాష్ రాజ్.. కరోనా సమయంలో కూడా ఎంతోమందికి సహాయం చేశారు.. చదువుకునే రోజులలో కూడా పేదవారికి తన వంతు సహాయం కూడా చేసేవారట. ఉత్తమ గుణచిత్ర నటుడుగా ఉత్తమ నటుడుగా ఎన్నో జాతీయ అవార్డులను కూడా అందుకున్న ప్రకాష్ రాజ్ మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్ వైవాహిక జీవితం..

ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నారు.. ఈమె ఎవరో కాదు డిస్కో శాంతి సోదరి.. వీరికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది.. ఆ తర్వాత 2010లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్.. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. 2019లో బెంగళూరులో సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఓడిపోయారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు