Mythri Movie Makers : కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ప్లాన్..

Mythri Movie Makers : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )ఒకటి. శ్రీమంతుడు సినిమాతో సినిమాలను నిర్మించడం మొదలు పెట్టిన ఈ సంస్థ నేడు దిగ్విజయంగా ఇంకొన్ని సినిమాలను నిర్మిస్తూ కొనసాగుతుంది. చాలామంది స్టార్ హీరోలు ఈ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలను చేస్తున్నారు. ఇకపోతే పుష్ప సినిమాతో రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయి రికగ్నైజేషన్ పొందుకుంది ఈ సంస్థ. ఈ సంస్థలో ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సాధించిన ఘనవిజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లిన సినిమాలలో పుష్ప కూడా ఒకటి. పుష్ప సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం పుష్ప 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది చిత్ర యూనిట్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన అద్భుతమైన హిట్ సినిమాలలో రంగస్థలం సినిమా ఒకటి. సుకుమార్ లోని ఒక కొత్త దర్శకుడిని రామ్ చరణ్ లోని ఒక సరికొత్త నటుడిని బయటకు తీసిన సినిమా రంగస్థలం. ఈ కాంబినేషన్లో మరో సినిమా రీసెంట్ గా అనౌన్స్ చేసింది మైత్రి మూవీ మేకర్ సంస్థ. ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కే జి ఎఫ్ సినిమాతో ఒక చెరిగిపోని ముద్రను వేసి రీసెంట్ గా సలార్ సినిమాతో కూడా తన స్టామినా ఏంటో చూపించాడు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్స్ తో పాటు ఎన్నో స్టార్ హీరోస్ ప్రాజెక్ట్స్ ను ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది. ప్రభాస్ హీరోగా హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, రాబిన్ హుడ్, వంటి సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, రాహుల్ కాంబినేషన్ సినిమా, ఫణీంద్ర 8 వసంతాలు కొంచెం సినిమాలను ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది. వీటితోపాటు ఇంకొన్ని సినిమాలు కూడా డిస్కషన్ లో ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఈ ప్రొడక్షన్స్ లో నిర్మితమయ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా కొన్ని వీడియోస్ కూడా అంచనాలను విపరీతంగా పెంచుతున్నాయి. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సగటు పవన్ కళ్యాణ్ అభిమాని కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుంటాడో అలా చూపిస్తుంటాడు హరీష్.

ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియనిది కాదు. తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ గా అప్పట్లో ఆ సినిమా హిట్ సాధించింది. పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఒక సరైన హిట్ సినిమా పడితే ఎలా ఉంటుంది అని ప్రూవ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మితమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు