Uday kiran : చిరంజీవి ఇష్యూపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయ్ కిరణ్ సోదరి..!!

Uday kiran : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరోలలో ఉదయ్ కిరణ్ (Uday kiran)9 కు మొదటి స్థానం ఉంటుంది.. అయితే అనుకోకుండా ఆత్మహత్య చేసుకుని అటు అభిమానులకు.. ఇటు కుటుంబానికి కూడా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు ఉదయ్ కిరణ్.. ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు తన కెరియర్ లో వరుసగా ఫ్లాపులు ఉండడం.. పైగా సినిమాల ఫలితాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఛాన్సులు కూడా రాకపోవడం వల్లే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడడం వల్లే మరణించారని.. అలాగే తన భార్యతో విభేదాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు అయితే వినిపించాయి.

సుస్మిత తో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం..

ముఖ్యంగా చిరంజీవి పెద్ద కుమార్తె తో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత వివాహం క్యాన్సిల్ అవ్వడంతో చిరంజీవి కావాలనే ఉదయ్ కిరణ్ ను తొక్కేసారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికి కూడా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇటీవల ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.

చిరంజీవి ఇష్యూ పై శ్రీ దేవీ స్పందన..

గతంలో చిరంజీవి , ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచి ఉదయ్ కిరణ్ కి చిరంజీవి పెద్ద అభిమాని అని.. చిన్నప్పుడు ఒక ఈవెంట్లో ఆయనను కలిస్తే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు.. సినిమాలలోకి వచ్చాక చిరంజీవి ఉదయ్ కిరణ్ కి బాగా సపోర్ట్ చేశారని ఉదయ్ కిరణ్ సోదరి తెలియజేసింది. చిరంజీవి ఉదయ్ కిరణ్ కి గాడ్ ఫాదర్ లాగా ఉండేవారని కూడా తెలియజేసింది.

- Advertisement -

చిరంజీవి ఉదయ్ కిరణ్ కి గాడ్ ఫాదర్ లాంటివారు..

సినిమాల గురించి కూడా ఎప్పుడు ఉదయ్ కిరణ్ చిరంజీవితో ఎక్కువగా చర్చించే వారని.. ఇప్పుడు ఉదయ్ కిరణ్ లేరు.. జరిగిందేదో జరిగిపోయింది కానీ.. ఏ విషయాన్ని తాను తప్పుపట్టనని ఉదయ్ కిరణ్ లేకపోయినా ఆయన గురించి పలు రకాల మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందంటూ ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి వెల్లడించింది.. ఏది ఏమైనా చిరంజీవి ఉదయ్ కిరణ్ కి చాలా సపోర్ట్ చేశారనే విషయాన్ని మాత్రం తెలియజేసింది.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

చిరంజీవి పై ఫ్యాన్స్ ఖుషీ..

ఇకపోతే ఈ విషయంపై ఇప్పటివరకు చిరంజీవిని విమర్శించిన వారు.. శ్రీదేవి వ్యాఖ్యలతో అందరూ చిరంజీవి ఎంత గొప్పవారో మరొకసారి తెలుసుకున్నట్లు అవుతుంది అంటూ మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.. ఏదేమైనా చిరంజీవి గొప్పదనానికి అందరూ ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు