Allu Arjun : అల్లు అర్జున్ తో ఇక చస్తే నటించను – స్టార్ హీరోయిన్..!!

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నది.. చాలామంది హీరోయిన్లు సైతం అల్లు అర్జున్ తో ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే చాలామంది హీరోయిన్స్ అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలో చిన్న అవకాశము వచ్చినా ఎగిరి గంతేస్తూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా ఈ యేడాది ఆగస్టు 15న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. షూటింగ్ అయితే ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ తో అను ఇమ్మాన్యుయెల్

ఇదిలా వుండగా.. అల్లు అర్జున్ (Allu Arjun) తో చాలామంది హీరోయిన్స్ నటించాలని కోరుకుంటున్నారు.. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఒకప్పుడు చిన్న చిన్న హీరోలతో నటిస్తే గుర్తింపు రాదని భావించి.. అల్లు అర్జున్ తో అవకాశం రాగానే ఆలోచించకుండా ఓకే చెప్పి.. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నానంటోంది. ఆమె ఎవరో కాదు అను ఇమ్మానుయేల్. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి నటించినా.. ఫ్లాప్ గా మిగిలింది.. ఆ తర్వాత అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఊరు ఇండియా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

అల్లు అర్జున్తో ఇకపై నటించను..

అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ముఖ్య కారణం అను ఇమ్మాన్యుయెల్ కారణమని అల్లు అర్జున్ అభిమానులు చాలా దారుణంగా ట్రోల్ చేశారు.. ఈమెను ఐరన్ లెగ్ అని కూడా ముద్రించారు.. ఆ సమయంలో తను చాలా ఇబ్బంది పడ్డాను అని బుద్ధిలేక ఈ హీరోతో నటించానని.. భవిష్యత్తులో ఇకమీదట నటించనని కూడా అనుకున్నట్లు గతంలో వార్తలు బాగా వినిపించాయి.. దీంతో ఈమెకు తెలుగులో కూడా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలోనే పరిమితమైంది.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ మాత్రం పుష్ప-2 సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కథ విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.. మరి అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేస్తారా? మరో కొత్త దర్శకులతో పని చేస్తారా? అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నది..

అను ఇమ్మాన్యుయెల్ కెరియర్..

ఇక అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగులో నటించినా.. అవకాశాలు రాకపోవడంతో తమిళం వైపు అడుగులు వేసింది.. కానీ తెలుగులో కూడా ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. సరైన కథతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించాలని కూడా కోరుకుంటున్నారు.. మజ్ను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ సినిమాతో ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.. ఈ క్రమంలోనే ఆమె మళ్ళీ నటించాలని కోరుకుంటున్నారు.. మరి అభిమానుల కోరిక మేరకు అను మళ్లీ తెలుగులో నటిస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు